Girl Raped : స్కూల్‌కు వెళ్తున్న బాలికపై అత్యాచారం..పారిపోతున్న నిందితుడిపై పోలీసులు కాల్పులు

ఉత్తర ప్రదేశ్ లో దారుణం జరిగింది. స్కూల్‌కు వెళ్తున్న బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు అరెస్ట్‌ నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపారు.

Girl Raped : స్కూల్‌కు వెళ్తున్న బాలికపై అత్యాచారం..పారిపోతున్న నిందితుడిపై పోలీసులు కాల్పులు

Raped

man raped girl : ఉత్తర ప్రదేశ్ లో దారుణం జరిగింది. స్కూల్‌కు వెళ్తున్న బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు అరెస్ట్‌ నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ సంఘటన నోయిడాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 12 ఏళ్ల బాలిక బుధవారం(జులై27,2022) ఉదయం స్కూల్‌కు వెళ్తోంది. 20 ఏళ్ల వ్యక్తి ఆ బాలికకు మాయ మాటలు చెప్పాడు.

సెక్టార్‌32లోని నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాలికపై అత్యాచారం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే నిందితుడిని అరెస్ట్‌ చేశారు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం వ్యాన్‌లో పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్తుండగా నిందితుడు తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో చుట్టుముట్టిన పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించగా వారిపై రాళ్ల దాడి చేశాడు.

Jharkhand: తొమ్మిదో తరగతి బాలిక కిడ్నాప్.. మూడు నెలలుగా సామూహిక అత్యాచారం

ఈ క్రమంలో పోలీసులు నిందితుడిపై కాల్పులు జరుపడంతో గాయపడ్డాడు. అతడిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. ఆ తర్వాత ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లైంగిక దాడి, పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.