Jharkhand: తొమ్మిదో తరగతి బాలిక కిడ్నాప్.. మూడు నెలలుగా సామూహిక అత్యాచారం

తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను కిడ్నాప్ చేసి రహస్య ప్రాంతానికి తీసుకెళ్లారు ముగ్గురు నిందితులు. అక్కడ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు మూడు నెలలు ఈ దారుణానికి తెగబడ్డారు. చివరకు బాలిక తప్పించుకుంది.

Jharkhand: తొమ్మిదో తరగతి బాలిక కిడ్నాప్.. మూడు నెలలుగా సామూహిక అత్యాచారం

Jharkhand

Jharkhand: ఝార్ఖండ్‌లో దారుణం జరిగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను ఎత్తుకొచ్చిన ముగ్గురు వ్యక్తులు, రహస్య ప్రాంతంలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు మూడు నెలలు ఈ ఆకృత్యం కొనసాగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఝార్ఖండ్‌లోని బొకారో ప్రాంతంలో ఏప్రిల్ 20న బాలికను నిందితులు అపహరించారు.

Car Stunt: కారుతో స్టంట్ కోసం ప్రయత్నించిన డ్రైవర్.. డివైడర్ దాటి దూసుకెళ్లిన కారు.. వీడియో వైరల్

తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక స్థానిక మార్కెట్ నుంచి ఇంటికి వెళ్తుండగా, ముగ్గురు వ్యక్తులు ఆటోలో కిడ్నాప్ చేశారు. తర్వాత ఒక రహస్య ప్రదేశానికి బాలికను తీసుకెళ్లి బంధించారు. అక్కడే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు మూడు నెలలుగా బాలికను బంధించి అత్యాచారం చేశారు. బాలిక తప్పించుకునేందుకు ప్రయత్నిస్తే తీవ్రంగా కొట్టేవారు. బయటకు వెళ్లేటప్పుడు గదికి తాళం వేసి వెళ్లిపోయేవారు. అయితే, ఈ నెల 19న అదే దారిలో వెళ్తున్న ఒక మహిళ గమనించి బాలికను చూసింది. రాయితో తాళం పగులగొట్టి బాలికను రక్షించింది. తర్వాత ఇంటికి చేరుకున్న బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Tigers Died: పులుల దాడుల్లో 125 మంది మృతి.. మూడేళ్లలో మరణించిన పులులు 329

ప్రస్తుతం నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితులను మనోజ్ కుమార్, విష్ణు కుమార్, మంతోష్ కుమార్‌గా గుర్తించారు. ప్రస్తుతం వీళ్లంతా పరారీలో ఉన్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే, బాలిక కనిపించకుండా పోయిన రోజే తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పట్లో మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు.