Tigers Died: పులుల దాడుల్లో 125 మంది మృతి.. మూడేళ్లలో మరణించిన పులులు 329

మూడేళ్లలో పులుల దాడుల్లో దేశవ్యాప్తంగా 125 మంది మరణించినట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే మూడేళ్లలో 329 పులులు కూడా ప్రాణాలు కోల్పోయాయి. కేంద్ర పర్యావరణ శాఖ పార్లమెంటులో వెల్లడించిన వివరాలివి.

Tigers Died: పులుల దాడుల్లో 125 మంది మృతి.. మూడేళ్లలో మరణించిన పులులు 329

Tigers Died

Tigers Died: దేశంలో మూడేళ్లలో 329 పులులు మరణించినట్లు కేంద్రం వెల్లడించింది. కేంద్ర పర్యావరణ శాఖా మంత్రి అశ్విని కుమార్ చౌబే లోక్‌సభలో సోమవారం ఈ వివరాలు వెల్లడించారు. ఆయన నివేదిక ప్రకారం.. 2019-2021 వరకు 329 దేశంలో పులులు మరణించాయి. 2019లో 96, 2020లో 106, 2021లో 127 పులులు ప్రాణాలు కోల్పోయాయి.

Car Stunt: కారుతో స్టంట్ కోసం ప్రయత్నించిన డ్రైవర్.. డివైడర్ దాటి దూసుకెళ్లిన కారు.. వీడియో వైరల్

వీటిలో 68 పులులు సహజ మరణం పొందాయి. మిగతావి అసహజ కారణాలు, వేటగాళ్ల దాడి వంటి కారణాలతో ప్రాణాలు కోల్పోయాయి. వీటిలో 197 పులుల మరణాలకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మూడేళ్లలో ఏనుగులు కూడా భారీగానే మరణించాయి. వేటగాళ్ల దాడి, కరెంట్ షాక్, విష ప్రయోగం, రైలు ఢీకొనడం వంటి కారణాల వల్ల దాదాపు 307 ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి. అయితే గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో జంతువుల వేట తగ్గిపోయింది. 2019-21 మధ్య కాలంలో 17 పులులు మాత్రమే వేటగాళ్లకు బలయ్యాయి. కాగా, పులుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మనుషుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఈ మూడేళ్లలో దాదాపు 125 మంది ప్రాణాలు కోల్పోయారు.

Spurious Liquor: కల్తీ మద్యం సేవించి 25 మంది మృతి… మరో 40 మంది పరిస్థితి విషమం

అందులో అత్యధికంగా మహారాష్ట్రలో 61 మంది, ఉత్తర ప్రదేశ్‌లో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. విద్యుత్ షాకుల కారణంగా 222 ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి. ఒడిశాలో 41, తమిళనాడులో 34, అసోంలో 33 ఏనుగులు కరెంట్ షాకుతో మరణించాయి. రైలు ఢీకొనడం వల్ల45 ఏనుగులు మరణించాయి. ఒడిశాలో 12, పశ్చిమ బెంగాల్‌లో 11 ఏనుగులు రైలు ప్రమాదాలో మృతి చెందాయి. వేటగాళ్ల బారిన పడి 29 ఏనుగులు మరణించాయి. ఒడిశా, మేఘాలయ, అసోంలలో వేటగాళ్లు ఏనుగుల్ని చంపారు.