Bhopal : వాహనాన్ని తీసుకెళ్లాడని ట్రాఫిక్ ఎస్ఐపై దాడి..దారుణంగా కత్తితో పొడిచాడు

2021, ఆగస్టు 08వ తేదీ శనివారం హర్ష్ మీనా అనే వ్యక్తి జ్యోతి టాకీస్ కు వెళ్లాడు. అక్కడ నో పార్కింగ్ జోన్ లో బైక్ ను పార్కు చేశాడు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నారు ఇన్స్ పెక్టర్ శ్రీరామ్ దూబే. నో పార్కింగ్ జోన్ లో ఉన్న వాహనాలను పోలీసులు క్రేన్ సహాయంతో క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అందులో హర్ష్ మీనా బైక్ కూడా ఉంది.

Bhopal : వాహనాన్ని తీసుకెళ్లాడని ట్రాఫిక్ ఎస్ఐపై దాడి..దారుణంగా కత్తితో పొడిచాడు

Trafic

Wrongly Parked Two Wheeler : నో పార్కింగ్ జోన్ లో వాహనాన్ని పార్క్ చేస్తే..ట్రాఫిక్ పోలీసులు చూస్తూ ఊరుకుంటారా ? వాహనాన్ని తీసుకెళ్లి పీఎస్ కు తరలిస్తారు. అప్పుడు మీరేం చేస్తారు ? తప్పే కదా అని భావించి..నిబంధనల ప్రకారం ఫైన్ ను కట్టేసి వాహనాన్ని తీసుకెళుతారు కదా. అయితే..కొంతమంది ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదం..చేసిన ఘటనలు కూడా చూస్తుంటాం. కానీ ఓ వ్యక్తి మాత్రం తీవ్ర ఆగ్రహంతో..ట్రాఫిక్ ఎస్ఐని కత్తితో దారుణంగా చంపేశాడు. ఈ ఘటన భోపాల్ లో చోటు చేసుకుంది.

Read More : Vaccination Certificate : వాట్సాప్​లో కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్..సెకన్లలోనే పొందండి ఇలా

2021, ఆగస్టు 08వ తేదీ శనివారం హర్ష్ మీనా అనే వ్యక్తి జ్యోతి టాకీస్ కు వెళ్లాడు. అక్కడ నో పార్కింగ్ జోన్ లో బైక్ ను పార్కు చేశాడు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నారు ఇన్స్ పెక్టర్ శ్రీరామ్ దూబే. నో పార్కింగ్ జోన్ లో ఉన్న వాహనాలను పోలీసులు క్రేన్ సహాయంతో క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అందులో హర్ష్ మీనా బైక్ కూడా ఉంది. ఈ విషయం అతనికి తెలిసిందే. వెంటనే క్రైమ్ బ్రాంచ్ పీఎస్ కు చేరుకున్నాడు. అనంతరం వారు చెప్పిన డాక్యుమెంట్స్, రూ. 600 డబ్బులు తీసుకరావడానికి ఇంటికి వచ్చాడు.

Read More : Indravelli Sabha : వారి ఓటు బ్యాంకే టార్గెట్‌‌గా, ఇంద్రవెల్లి సభకు ఏర్పాట్లు పూర్తి

అనంతరం వారు చెప్పిన విధంగా పీఎస్ కు వచ్చి…రూ. 600 డబ్బులు డిపాజిట్ చేశాడు. ఆ సమయంలో పోలీస్ స్టేషన్ వద్ద క్రేన్ వద్ద ఎస్ఐ శ్రీరామ్ నిలబడి ఉన్నారు. అంతే..ఒక్కసారిగా అతడిపై దాడికి పాల్పడ్డాడు హర్ష్ మీనా. కత్తితో అత్యంత దారుణంగా కడుపులో పొడిచేశాడు. అనంతరం పారిపోవడానికి ప్రయత్నించిన హర్ష్ ను అక్కడున్న మిగతా పోలీసులు పట్టుకున్నారు. దాడికి పాల్పడిన హర్ష్ మానసికస్థితి సరిగ్గా లేదని పోలీసులు వెల్లడిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన పోలీసు ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలియాల్సి ఉంది.