TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్.. హైకోర్టుకు సమర్పించిన సిట్ దర్యాప్తు అడిషనల్ నివేదికలో కీలక అంశాలు

ఏఈ పేపర్ ద్వారా రూ.31 లక్షలు కలెక్ట్ చేశారని వెల్లడించింది. అన్ని పేపర్ లు కలిపి రూ.42 లక్షలు లావాదేవీలు జరిగినట్లు తెలిపింది.

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్.. హైకోర్టుకు సమర్పించిన సిట్ దర్యాప్తు అడిషనల్ నివేదికలో కీలక అంశాలు

TSPSC Paper Leak

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ ముమ్మర దర్యాప్తు చేస్తోంది. పేపర్ లీకేజీ కేసులో దర్యాప్తు అడిషనల్ నివేదికను సిట్ హైకోర్టుకు సమర్పించింది. కోర్టుకు సమర్పించిన నివేదికలో సిట్ కీలక అంశాలు పేర్కొంది. పేపర్ లీకేజీ కేస్ లో రాజశేఖర్ బావ ప్రశాంత్ ను ఏ-16 గా చేర్చింది. ప్రశాంత్ ఇంకా పరారిలో ఉన్నారని, ప్రశాంత్ పారి పోయి న్యూజిలాండ్ లో ఉన్నారని సిట్ తెలిపింది.

40 మంది సాక్షులను విచారించామని పేర్కొంది. ఏఈ పేపర్ ద్వారా రూ.31 లక్షలు కలెక్ట్ చేశారని వెల్లడించింది. అన్ని పేపర్ లు కలిపి రూ.42 లక్షలు లావాదేవీలు జరిగినట్లు తెలిపింది. దాక్యా బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.4 లక్షలు సిట్ ఫ్రీజ్ చేసింది.

TSPSC : పేపరు లీకు కేసులో అఫిడవిట్ దాఖలు చేసిన టీఎస్పీఎస్సీ

మార్చి  28న ప్రవీణ్ మామ సిట్ కార్యాలయానికి వచ్చి రూ.3 లక్షలు ఇచ్చాడని తెలిపింది. 379 సెక్షన్ ను సిట్ అదనంగా యాడ్ చేసింది. విచారణ సందర్భంగా కీలక ఆధారాలు సేకరించామని వెల్లడించింది. సేకరించిన ఆధారాలను ఫోరెన్సిక్ కు పంపామని పేర్కొంది. సెంట్రల్ ఫోరెన్సిక్ నుండి రిపోర్ట్ రావాల్సి ఉందని తెలిపింది.