TSPSC : పేపరు లీకు కేసులో అఫిడవిట్ దాఖలు చేసిన టీఎస్పీఎస్సీ

పేపర్ లీకేజీ తో చాలా పరీక్షలు రద్దు చేసినట్టు కోర్టుకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి టీఎస్పీఎస్సీ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టులు చేశారు. అనంతరం ఈ కేసును సిట్‭కు బదిలీ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతున్న కారణంగా ఈ పిటిషన్‭ను డిస్మిస్ చేయాలని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‭లో టిఎస్పీఎస్సీ కోరింది

TSPSC : పేపరు లీకు కేసులో అఫిడవిట్ దాఖలు చేసిన టీఎస్పీఎస్సీ

Telangana High Court

TSPSC : పేపరు లీకు కేసును సీబీఐ చేత విచారణ చేయించాలన్న విపక్షాల డిమాండ్ల నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది టీఎస్పీఎస్సీ. అడిషనల్ సెక్రెటరీ సుమతి పేరుతో అఫిడవిట్
దాఖలైంది. టీఎస్పీఎస్సీ సెక్రెటరీ తరఫున అఫిడవిట్ అడిషనల్ సెక్రెటరీ దాఖలు చేశారు. కాగా, సిట్ తన నివేదికను షీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించింది. ఇదిలా ఉంటే కాన్ఫిడెన్షియల్ సెక్షన్‭లోకి ప్రవేశించి పేపర్స్ దొంగలించిన కేసులో బేగం బజార్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు టీఎస్పీఎస్సీ పేర్కొంది. పేపర్ లీకేజీ తో చాలా పరీక్షలు రద్దు చేసినట్టు కోర్టుకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి టీఎస్పీఎస్సీ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టులు చేశారు. అనంతరం ఈ కేసును సిట్‭కు బదిలీ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతున్న కారణంగా ఈ పిటిషన్‭ను డిస్మిస్ చేయాలని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‭లో టిఎస్పీఎస్సీ కోరింది. ఈ కేసుపై విచారణను సోమవారానికి వాయిదా వేశారు.