Woman kills infant son: 4 నెలల కుమారుడిని అతి దారుణంగా చంపిన తల్లి.. మూఢ నమ్మకమే కారణం

ఓ మహిళ (35) తనకు ఉన్న వ్యాధి తగ్గాలని నాలుగు నెలల కుమారుడిని చంపుకుంది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ జిల్లా ధనుదీ గ్రామంలో చోటుచేసుకుంది. తన ప్రాణాలయినా ఇచ్చి పిల్లల ప్రాణాలు కాపాడుకోవాలని అనుకుంటుంది తల్లి. అయితే, మూఢ నమ్మకాల వలలో చిక్కుకుని అమ్మతనానికే మచ్చ తెచ్చేలా వ్యవహరించింది ధునుదీ గ్రామంలోని మంజూ అనే మహిళ.

Woman kills infant son: 4 నెలల కుమారుడిని అతి దారుణంగా చంపిన తల్లి.. మూఢ నమ్మకమే కారణం

Karnataka teacher beats class 4 student to death

Updated On : January 9, 2023 / 7:18 AM IST

Woman kills infant son: కంప్యూటర్ యుగంగా చెప్పుకునే ఈ కాలంలోనూ చాలా మంది మూఢ నమ్మకాల నుంచి బయటపడలేకపోతున్నారు. మూఢాచారాలు కొన్ని ప్రాంతాల్లో ఎంత బలంగా ఉన్నాయంటే కన్న కొడుకును కూడా చంపుకునే స్థితిలో కొంత మంది ఉన్నారు. స్వార్థం, మూఢ నమ్మకాలు, చేతబడులు కొందరి జీవితాలను నాశనం చేస్తున్నాయి.. కొందరిని జైలు పాలు చేస్తున్నాయి. తాజాగా, ఓ మహిళ (35) తనకు ఉన్న వ్యాధి తగ్గాలని నాలుగు నెలల కుమారుడిని చంపుకుంది.

ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ జిల్లా ధనుదీ గ్రామంలో చోటుచేసుకుంది. తన ప్రాణాలయినా ఇచ్చి పిల్లల ప్రాణాలు కాపాడుకోవాలని అనుకుంటుంది తల్లి. అయితే, మూఢ నమ్మకాల వలలో చిక్కుకుని అమ్మతనానికే మచ్చ తెచ్చేలా వ్యవహరించింది ధునుదీ గ్రామంలోని మంజూ అనే మహిళ.

ఆమె కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. కుమారుడిని బలి ఇస్తే తన అనారోగ్య సమస్య తగ్గుతుందని ఆ మహిళ భావించింది. కన్న కుమారుడు అని కూడా చూడకుండా పారతో కొట్టి నాలుగు నెలల పసివాడిని అతి దారుణంగా చంపేసింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

మంజూ భర్త కాన్పూర్ లో కూలీ పనులు చేస్తుంటాడని పోలీసులు మీడియాకు తెలిపారు. నిందితురాలు మంజూను అరెస్ట్ చేశామని, ఈ కేసులో తదుపరి విచారణ జరుపుతున్నామని వివరించారు. కన్న కుమారుడిని చంపేసిన మహిళ నిర్వాకం సుల్తాన్ పూర్ లో కలకలం రేపింది.

CM KCR Visit Districts : ఈ నెల 12 నుంచి సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన.. నూతన సమీకృత కలెక్టరేట్లకు ప్రారంభోత్సవం