Man Kills Pigeons : అమానుషం.. పక్కింటి వారిపై అనుమానంతో 30 పావురాలను చంపేశాడు

అనుమానం పెను భూతమైంది. పగతో రగిలిపోయిన అతడు దారుణానికి ఒడిగట్టాడు. శాంతికి చిహ్నమైన పావురాలను చంపేశాడు. పొరుగింటి వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆ వ్యక్తి ఇంత దారుణానికి పాల్పడింది.

Man Kills Pigeons : అమానుషం.. పక్కింటి వారిపై అనుమానంతో 30 పావురాలను చంపేశాడు

Man Kills Pigeons : ఉత్తరప్రదేశ్ లోని బరేలీ నియోజకవర్గం షాజహాన్ పూర్ లో అమానుష ఘటన జరిగింది. అనుమానం పెను భూతమైంది. పగతో రగిలిపోయిన అతడు దారుణానికి ఒడిగట్టాడు. శాంతికి చిహ్నమైన పావురాలను చంపేశాడు. పొరుగింటి వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆ వ్యక్తి ఇంత దారుణానికి పాల్పడింది.

జలాల్ నగర్ లో నివాసం ఉండే వారిస్ అలీ (32) పావురాల శిక్షకుడు. అతడు తన ఇంటి టెర్రస్ పై 78 పావురాలను పెంచుతున్నాడు. వారి పక్కింట్లో అబిద్ తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. అతడు ఓ పిల్లిని పెంచుకుంటున్నాడు. అయితే, సడెన్ గా పిల్లి మాయమైంది. కనిపించకుండా పోయింది. పక్కింటోళ్లే దాన్ని మాయం చేసి ఉంటారని, వారిస్ అలీ చంపేసి ఉంటాడని పిల్ల యజమాని అనుమానించాడు. అంతే, అతడు ప్రతీకారం తీర్చుకున్నాడు. వారిస్ అలీ ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పావురాలను కడేతేర్చాడు.

Biker Dragged Old Man : వీడు మనిషేనా.. రోడ్డుపై వృద్ధుడిని ఈడ్చుకెళ్లిన బైకర్.. బెంగళూరులో అమానుషం

కొన్నిరోజుల కిందట వారిస్ అలీ నివాసంలో టెర్రస్ పై 30 పావురాలు చనిపోయిన స్థితిలో కనిపించాయి. దాంతో వారిస్ అలీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పక్కింటి వ్యక్తి తన పావురాలపై విషప్రయోగం చేశాడని అలీ ఆరోపించాడు. వారి పిల్లిని తాము అపహరించామని తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పాడు. తాను కూడా జంతు ప్రేమికుడినే అని, అలా ఎందుకు చేస్తానని వారిస్ అలీ అన్నాడు. పిల్లి విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అబిద్ కుటుంబ సభ్యులు తమపై పగబట్టారని, పావురాలను చంపేస్తామని బెదిరించారని అలీ వెల్లడించాడు.

Also Read..Kerala: కాలేజీలో హీరోయిన్‌తో విద్యార్థి అసభ్య ప్రవర్తన.. సస్పెండ్ చేసిన యాజమాన్యం

అబిద్ సభ్యుల్లో ఒకరు తమ టెర్రస్ పైకి చేరుకుని విషం కలిపిన ధాన్యం గింజలు వేయడం తన కంటబడిందని ఆ పావురాల పెంపకందారు వివరించాడు. ఎంతో ప్రేమగా పెంచుకున్న పావురాలు కళ్లముందే ప్రాణాలు విడిచాయని వారిస్ అలీ కన్నీటి పర్యంతం అయ్యాడు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కాగా, మృతి చెందిన పావురాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతానికి అబిద్ పై సెక్షన్ 428 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. మాయమైన పిల్లి తిరిగి అబిద్ ఇంటికి వచ్చేసింది.