Biker Dragged Old Man : వీడు మనిషేనా.. రోడ్డుపై వృద్ధుడిని ఈడ్చుకెళ్లిన బైకర్.. బెంగళూరులో అమానుషం

బెంగళూరులో టూ వీలర్ రైడర్ రెచ్చిపోయాడు. వృద్ధుడి పట్ల అమానుషంగా వ్యవహరించాడు. కనీసం మానవత్వం లేకుండా దారుణంగా ప్రవర్తించాడు.

Biker Dragged Old Man : వీడు మనిషేనా.. రోడ్డుపై వృద్ధుడిని ఈడ్చుకెళ్లిన బైకర్.. బెంగళూరులో అమానుషం

Biker Dragged Old Man : బెంగళూరులో టూ వీలర్ రైడర్ రెచ్చిపోయాడు. వృద్ధుడి పట్ల అమానుషంగా వ్యవహరించాడు. కనీసం మానవత్వం లేకుండా దారుణంగా ప్రవర్తించాడు. సాహిల్(25) అనే వ్యక్తి టూ వీలర్ తో పలు వాహనాలను ఢీకొట్టాడు. దీంతో కారు ఓనర్ అయిన వృద్ధుడు ముత్తప్ప(71) సాహిల్ ను నిలదీశాడు. స్కూటీని పట్టుకుని మాట్లాడుతుండగా.. సాహిల్ తన బైక్ ను స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు.

వృద్ధుడు బైక్ ను వెనుక వైపున అలాగే పట్టుకున్నాడు. అయినా సాహిల్ బండిని ఆపలేదు. ఆ వృద్ధుడిని అలాగే అర కిలోమీటర్ దూరం వరకు రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. ఈ దారుణాన్ని చూసిన ఓ ఆటో డ్రైవర్ కొంత దూరం వెళ్లాక స్కూటీకి తన ఆటోని అడ్డంగా పెట్టి స్కూటీని ఆపేశాడు. అక్కడికి చేరుకున్న ఇతర వాహనదారులు సాహిల్ ను నిలదీశారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. సాహిల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read..Delhi Man Hacked : అత్యంత కిరాతకం.. యువకుడిని చంపి ముక్కలుగా నరికి ఆ వీడియోను పాకిస్తాన్‌ పంపారు, ఎందుకో తెలిస్తే షాక్

బైకర్ సాహిల్ ను మెడికల్ సేల్స్ మన్ గా పోలీసులు గుర్తించారు. వృద్ధుడిని ముత్తప్పగా గుర్తించారు. మగడి రోడ్ లో తన బైక్ తో కారుని ఢీకొట్టాడు సాహిల్. ఈ యాక్సిడెంట్ గురించి కారు ఓనర్ అయిన వృద్ధుడు.. సాహిల్ ను నిలదీశాడు. అయితే, సాహిల్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే, వృద్ధుడు బైక్ వెనుక వైపున చేత్తో గట్టిగా పట్టుకున్నాడు. అయినా, సాహిల్ ఆగలేదు. బైక్ ను వేగంగా పోనిచ్చాడు. వృద్ధుడిని అలాగే రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు.

Also Read..Woman Kills Husband : దృశ్యం సినిమా తరహా మర్డర్.. భర్తను చంపి శవాన్ని పూడ్చి సెప్టిక్ ట్యాంక్‌ నిర్మించిన భార్య

చివరికి అర కిలోమీటర్ దూరం వెళ్లాక ఓ ఆటో డ్రైవర్ వేగంగా వచ్చి బైక్ కు అడ్డుగా పెట్టడంతో.. బైక్ ను ఆపాడు సాహిల్. అమానుషంగా వ్యవహరించిన బైకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవింద రాజ్ నగర్ పోలీస్ స్టేషన్ లో అతడిపై కేసు నమోదైంది. స్వల్ప గాయాలపాలైన వృద్ధుడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

వృద్ధుడిని ఈడ్చుకెళ్లిన బైకర్..

వృద్ధుడు అని కూడా చూడకుండా, జాలి దయ లేకుండా అత్యంత అమానుషంగా వ్యవహరించిన సాహిల్ తీరుపై వాహనదారులు తీవ్రంగా మండిపడుతున్నారు. వాడసలు మనిషే కాదని అంటున్నారు. ఇంతటి ఘోరానికి పాల్పడ్డ సాహైల్ ను కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు. కాగా, ఈ ఘటనలో వృద్ధుడు గాయాలతో బటయపడ్డాడు. లేదంటే దారుణం జరిగిపోయి ఉండేదని స్థానికులు అంటున్నారు. వృద్ధుడిని బైక్ తో లాక్కెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాహైల్ తీరు పట్ల అంతా విస్తుపోతున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.