Wife Gang Raped : దారుణం.. స్నేహితులతో కలిసి భార్యను గ్యాంగ్ రేప్ చేసిన భర్త

కట్టుకున్న భార్య పట్ల కిరాతకంగా ప్రవర్తించాడు. సభ్య సమాజం సిగ్గుతో తల దించుకునేలా వ్యవహరించాడు. తన స్నేహితులతో కలిసి భార్యను..

Wife Gang Raped : దారుణం.. స్నేహితులతో కలిసి భార్యను గ్యాంగ్ రేప్ చేసిన భర్త

Wife Gang Raped

Updated On : January 17, 2022 / 12:06 AM IST

Wife Gang Raped : భర్త అంటే భరించే వాడు అంటారు. జీవితాంతం భార్యకు తోడుగా ఉండి, ఆమెకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు. కని పెంచిన తల్లి, తండ్రిని వదిలి తనను నమ్మి వచ్చిన భార్యకు అన్నీ తానయ్యేవాడే భర్త. అయితే, ఆ భర్త మాత్రం మృగంలా మారాడు. కట్టుకున్న భార్య పట్ల కిరాతకంగా ప్రవర్తించాడు. సభ్య సమాజం సిగ్గుతో తల దించుకునేలా వ్యవహరించాడు. తన స్నేహితులతో కలిసి భార్యను గ్యాంగ్ రేప్ చేశాడు. ఆపై ఆమెను చిత్రహింసలు పెట్టాడు.

Block Unknown Numbers : ఈ ఆండ్రాయిడ్‌ ఫోన్లలో గుర్తుతెలియని నెంబర్లను ఇలా బ్లాక్ చేయండి..!

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ల్ ఈ ఘోరం జరిగింది. తన భర్త, అతడి స్నేహితులు అసహజరీతిలో తనపై అత్యాచారం చేసి సిగరెట్లతో ప్రైవేట్ భాగాల్లో కాల్చి టార్చర్‌ చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. లైంగిక దాడిని ప్రతిఘటిస్తే చంపేస్తామని బెదిరించారని తెలిపింది. ఇండోర్‌లోని షిప్రా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ ఫాం హౌస్‌లో 2019 నవంబర్, 2021 అక్టోబర్‌లో తనపై లైంగిక దాడి జరిగినట్టు పోలీసులతో చెప్పింది. ఏదో రకంగా ఫామ్ హౌస్‌ నుంచి తప్పించుకున్న బాధితురాలు ఛత్తీస్‌గఢ్‌లోని తన తల్లిదండ్రుల ఇంటికి చేరింది.

బాధితురాలిది ఛత్తీస్‌గఢ్‌. ఇండోర్‌కు చెందిన వ్యక్తిని మ్యాట్రీమోనీ సైట్‌ ద్వారా కలిసి వివాహం చేసుకుంది. అయితే, ఆ వ్యక్తికి అప్పటికే పెళ్లైందని పోలీసుల విచారణలో తెలిసింది.

Eating Egg : రోజూ కోడి గుడ్డు తింటే మధుమేహం ముప్పు

ఈ కేసులో మహిళ భర్తతో పాటు మొత్తం ఐదుగురు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో పలు ప్రాంతాల్లో వారందరినీ అరెస్టు చేశారు. భర్తే తన స్నేహితులతో కలిసి భార్యను గ్యాంగ్ రేప్ చేసిన ఘటన సంచలనంగా మారింది.