Wife Killed By Husband : భర్తను కొట్టి చంపిన భార్య

జనగామ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బచ్చన్నపేట మండలం కట్కూరులో ఓ భార్య భర్తను దారుణంగా కొట్టి చంపిన ఘటన వెలుగు చూసింది.

Wife Killed By Husband : భర్తను కొట్టి చంపిన భార్య

Murder

Updated On : September 24, 2021 / 8:30 AM IST

Wife Killed By Husband : జనగామ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బచ్చన్నపేట మండలం కట్కూరులో ఓ భార్య భర్తను దారుణంగా కొట్టి చంపిన ఘటన వెలుగు చూసింది. గ్రామంలో నివసించే గుడిద అశోక్, అండాలు భార్యా భర్తలు. వీరికి 8 నెలల బాబు ఉన్నాడు. గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి.

ఈక్రమంలో గురువారం భార్యా భర్తలిద్దరూ గొడవపడ్డారు. ఆవేశంలోఉన్న అండాలు సమీపంలోని ఇనుప రాడ్ తీసుకుని భర్త తలమీద బలంగా కొట్టింది.దీంతో అశోక్ అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు.   పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అండాలును అదుపులోకి తీసుకున్నారు. కేసునమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు