Women Pickpockets : కిలాడీ లేడీలు…మాటలు కలిపి డబ్బులు కొట్టేస్తూ….

మద్యం మత్తులో ఉన్న మగవారిని టార్గెట్ చేసుకుని వారిని మాటల్లో దింపి వారి వద్ద మనీ తీసుకుని పారిపోయే కిలాడీ లేడీస్ కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో తిరుగుతున్నారు.

Women Pickpockets : కిలాడీ లేడీలు…మాటలు కలిపి డబ్బులు కొట్టేస్తూ….

Lady Pick Pocketers

Updated On : July 30, 2021 / 12:17 PM IST

Women Pickpockets : మద్యం మత్తులో ఉన్న మగవారిని టార్గెట్ చేసుకుని వారిని మాటల్లో దింపి వారి వద్ద మనీ తీసుకుని పారిపోయే కిలాడీ లేడీస్ కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో తిరుగుతున్నారు. సిరిసిల్ల పాత మార్కెట్ ప్రాంతంలోని కల్లు కాంపౌండ్ అడ్డాగా ముగ్గురు మహిళలు ఒక వ్యక్తి కలిసి మందు బాబుల జేబుల్లోంచి డబ్బులు కాజేస్తున్నట్లు  పోలీసులుకు సమాచారం అందింది.

వారిని పట్టుకునేందుకు పోలీసులు నిఘా పెట్టారు. పోలీసులు నిఘా పెట్టినా వారికి  దొరకకుండా  మూడు రోజుల క్రితం ఒక వ్యక్తి దగ్గర 30 వేల రూపాయలు కొట్టేసినట్లు తెలిసింది. దీంతో పోలీసులు వారిని పట్టుకునేందుకు మరింత నిఘా పెంచినట్లు సిరిసిల్ల టౌన్ ఎస్సై అపూర్వ రెడ్డి తెలిపారు.