Hyderabad : యూట్యూబ్ సింగర్ ఆత్మహత్య.. తల్లిదండ్రులకు సూసైడ్ నోట్

తనకు బతకాలని లేదని, కుటుంబ సభ్యులను అందరినీ బాగా చూసుకోవాలని తల్లిదండ్రులకు లెటర్‌ రాసి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

Hyderabad : యూట్యూబ్ సింగర్ ఆత్మహత్య.. తల్లిదండ్రులకు సూసైడ్ నోట్

Youtube Singer Suicide

Updated On : March 16, 2022 / 6:13 PM IST

YouTube singer suicide : ఏం కష్టమొచ్చిందో ఏమో తెలియదు కానీ.. నిండు జీవితాన్ని బుగ్గి పాలు చేసుకున్నాడు. గొప్ప సింగర్ కావాలనుకున్న కలను కలగానే మిగుల్చుకున్నాడు. తన ఆయుష్షును తానే తీసుకొని విగత జీవిగా మారాడు. తల్లిదండ్రులను క్షమించమని లేఖ రాసి జీవితానికి ఎండ్ కార్డ్‌ వేసుకున్నాడు. తనకు బతకాలని లేదని, కుటుంబ సభ్యులను అందరినీ బాగా చూసుకోవాలని తల్లిదండ్రులకు లెటర్‌ రాసి ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

హైదరాబాద్ పాతబస్తీ కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాదం చోటుచేసుకుంది. చంపాపేటలో యూట్యూబ్ సింగర్ జటావత్‌ మోహన్‌ సూసైడ్‌ చేసుకున్నాడు. నల్గొండ జిల్లా పిల్లిగుండ్ల తండాకు చెందిన మోహన్ తన గదిలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Pregnant Suicide : గర్భిణీ ఉరివేసుకుని ఆత్మహత్య.. అదనపు కట్నం కోసం భర్త వేధింపులు?

సమాచారం అందుకున్న పోలీసులు మోహన్‌ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సూసైడ్‌కు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మోహన్ యూట్యూబ్‌లో బంజారాకు చెందిన కొన్ని పాటలు పాడాడు.