Manish Kashyap: తమిళనాడులో బిహారీలను హింసిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం.. పోలీసుల ముందు లొంగిపోయిన నిందితుడు మనీశ్ కశ్యప్

తమిళనాడులో ఉన్న బిహార్ వలస కార్మికుల మీద తీవ్ర దాడులు జరుగుతున్నాయని కశ్యప్ వీడియో చేసి తన యూట్యూబ్ చానప్‭లో అప్‭లోడ్ చేశాడు. ఇది అటు బిహార్ రాష్ట్రాన్ని ఇటు తమిళనాడు రాష్ట్రాన్ని కుదిపివేసింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీని మీద దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం బిహార్ నుంచి ఒక ప్రత్యేక బృందం తమిళనాడు వచ్చి అక్కడి స్థానిక పోలీసులతో విచారణ చేసింది

Manish Kashyap: తమిళనాడులో బిహారీలను హింసిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం.. పోలీసుల ముందు లొంగిపోయిన నిందితుడు మనీశ్ కశ్యప్

YouTuber Manish Kashyap surrenders before Bihar police in bihar migrants fake news case

Manish Kashyap: కొద్ది రోజుల క్రితం తమిళనాడు రాష్ట్రంలో బిహారీ వలసకార్మికుల మీద తీవ్ర దాడులు జరుగుతున్నాయంటూ తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబర్ మనీశ్ కశ్యప్ శనివారం పోలీసుల ముందు లొంగిపోయాడు. కొంత మందిని ముందుగా ప్రిపేర్ చేసి, ఉద్దేశ పూర్వకంగా తప్పుడు వీడియో తయారు చేసినట్టు తమిళనాడు-బిహార్ సంయుక్త టీం నిర్దారించింది. అప్పుడే మనీశ్ అరెస్ట్ అవుతారని ప్రచారం ప్రారంభమైంది. కాగా, పోలీసులు అరెస్ట్ చేయకముందే అతడే స్వయంగా వచ్చి లొంగిపోవడం గమనార్హం.

అసలు ఎవరీ మనీశ్
యూట్యూబర్‭గా ప్రచారం పొందిన మనీశ్ కశ్యప్ అసలు పేరు త్రిపురారి కుమార్ తివారి. 2020లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇతడు పోటీ చేశాడు. ఆ ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిటులో ఈ పేరును ప్రస్తావించాడు. 2009లో బిహార్‭లోని మహారాణి జానకి కున్వార్ కాలేజీలో క్లాస్12 చదివాడు. 2016లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అనంతరం యూట్యూబ్ వీడియోలు చేయడం ప్రారంభించాడు.

Pakistan: మాజీ ప్రధాని కోర్టుకెళ్లగానే.. ఆయన ఇంట్లోకి చొరబడి లాఠీఛార్జ్ చేసిన పోలీసులు

ఇతడి మీద కేసు ఎందుకు నమోదైంది?
తమిళనాడులో ఉన్న బిహార్ వలస కార్మికుల మీద తీవ్ర దాడులు జరుగుతున్నాయని కశ్యప్ వీడియో చేసి తన యూట్యూబ్ చానప్‭లో అప్‭లోడ్ చేశాడు. ఇది అటు బిహార్ రాష్ట్రాన్ని ఇటు తమిళనాడు రాష్ట్రాన్ని కుదిపివేసింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీని మీద దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం బిహార్ నుంచి ఒక ప్రత్యేక బృందం తమిళనాడు వచ్చి అక్కడి స్థానిక పోలీసులతో విచారణ చేసింది. అయితే ఆ వీడియోలో కనిపించినట్లుగా ఏం జరగలేదని తేలింది. అంతలోనే వీడియో షూట్ చేయడానికి ముందు దెబ్బలు తగిలిన వ్యక్తులు నవ్వుతూ కనిపించారు. అదంతా స్క్రిప్ట్ అని తెలిసిపోయింది. దీంతో కశ్యప్ మీద కేసు నమోదు అయింది.

Amritpal Singh: ఖలిస్తాని వేర్పాటువాద నేత అమృత్‌పాల్ సింగ్ అరెస్టు.. పంజాబ్‌లో ఇంటర్నేట్ సేవలు బంద్

Himachal Pradesh: ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు మీద ఏకంగా రూ.50 లక్షల సబ్సిడీ ప్రకటించిన ప్రభుత్వం

కాగా, రెండు రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నాయి. దీంతో తమ ప్రభుత్వాల మీద బురద చల్లడానికి బీజేపీనే ఇలా తప్పుడు ప్రచారం చేస్తోందని ఇద్దరు సీఎంలు విమర్శలు గుప్పించారు. కాగా, పశ్చిమ బిహార్ లోని చంపారన్ జిల్లాలో ఉన్న మఝౌలియాలో అతడి కోసం పోలీసులు గాలిస్తుండగా.. అతడే స్వయంగా వచ్చి జగదీష్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.