Puducherry Zipmer : పుదుచ్ఛేరి జిప్ మర్ లో 113 ఉద్యోగ ఖాళీల భర్తీ

దరఖాస్తు ఫీజు వివరాలకు సంబంధించి జనరల్ అభ్యర్ధులు 500రూ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు 250రూ, పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. దరఖాస్తులకు చివరి తేదిగా జూన్ 20, 2022గా నిర్ణయించారు.

Puducherry Zipmer : పుదుచ్ఛేరి జిప్ మర్ లో 113 ఉద్యోగ ఖాళీల భర్తీ

Puducherry Zippmer

Puducherry Zipmer : పుదుచ్ఛేరిలోని జవహర్ లాల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ( జిప్ మర్ ) లో పలు ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన మొత్తం 113 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధించి అనాటమీ, బయో కెమిస్ట్రీ, డెంటిస్గ్రీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ తదితర విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయోపరిమితి 45 సంవత్సరాలకు మించకూడదు. అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషనల్ లో పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ ఎండీ, ఎంఎస్, డీఎన్ బీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 1,10,000రూ వేతనంగా చెల్లిస్తారు. ఎంపిక విధానానికి సంబంధించి ఆన్ లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు వివరాలకు సంబంధించి జనరల్ అభ్యర్ధులు 500రూ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు 250రూ, పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. దరఖాస్తులకు చివరి తేదిగా జూన్ 20, 2022గా నిర్ణయించారు. రాత పరీక్షను జులై 9,2022న నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు https://www.jipmer.edu.in/ పరిశీలించగలరు.