తొలి దశలో 1500 స్కూల్స్ అభివృద్ధి : మంత్రి  ఆదిమూలపు సురేశ్

నాడు-నేడు కార్యక్రమం కింద తొలి దశలో 1500 స్కూల్స్ అభివృద్ధి చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు.

  • Published By: veegamteam ,Published On : December 19, 2019 / 10:27 AM IST
తొలి దశలో 1500 స్కూల్స్ అభివృద్ధి : మంత్రి  ఆదిమూలపు సురేశ్

నాడు-నేడు కార్యక్రమం కింద తొలి దశలో 1500 స్కూల్స్ అభివృద్ధి చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు.

నాడు-నేడు కార్యక్రమం కింద తొలి దశలో 1500 స్కూల్స్ అభివృద్ధి చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం(డిసెంబర్ 19, 2019) మీడియాతో మాట్లాడుత జూన్ నెలకు స్కూల్స్ లో మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు 2 వేల 500 స్కూళ్లను దత్తత తీసుకుంటున్నారని వెల్లడించారు. పాఠశాలల్లో 9 మౌలిక వసతులను అభివృద్ధి చేస్తామని చెప్పారు.

రూ.88 కోట్లు ఖర్చు చేసేందుకు పలు పెంపెనీలు ముందుకొచ్చాయన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తున్నామని చెప్పారు. తెలుగు భాష వికాసానికి సీఎం జగన్ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బిల్లు తిరిగి అసెంబ్లీకి వస్తుంది..ఆమోదిస్తామన్నారు.