Architecture Courses : ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు

ఫుల్ టైమ్ డాక్టొరల్ ప్రొగ్రామ్ లకు సంబందించి ప్లానింగ్, ఆర్కిటెక్చర్ లో 60శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైన వారు అర్హులు.

Architecture Courses : ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు

Delhi School Of Planing

Architecture Courses : న్యూ దిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ లో ప్రవేలకు దరఖాస్తులు కోరుతున్నారు. ఇందులో బ్యాచిలర్ స్ధాయిలో 2 కోర్సులు, పీజీ స్ధాయిలో 10 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. యూజీ బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ కోర్సులు ఈ సంస్ధ అందిస్తోంది. జేఈఈ మెయిన్ తో ప్రవేశం లభిస్తుంది. మాస్టర్, డాక్టొరల్ ప్రొగ్రాముల్లో ప్రవేశాలు పరీక్ష, ఇంటర్వ్యూల్లో ప్రతిభతో ఉంటాయి. పీజీ కోర్సుల వ్యవధి రెండేళ్లు, గేట్, సీడ్ లో అర్హత సాధించిన వారికి స్కాలర్ షిప్ అందిస్తారు.

ఇక కోర్సుల వారిగా వివరాలను పరిశీలిస్తే పోస్టు గ్రాడ్యుయేట్ ప్రొగ్రామ్ లో ఇన్ ఆర్కిటెక్చర్ కోర్సుకు సంబంధించి స్పెషలైజేషన్లుగా ఆర్కిటెక్చరల్ కన్జర్వేషన్, అర్బన్ డిజైన్, ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్చర్ ఉన్నాయి. అర్కిటెక్చర్ లో బ్యాచిలర్ డిగ్రీ కలిగిన వారు అర్హులు.

మాస్టర్ ఆఫ్ బిల్డింగ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్ మెంట్ కోర్సుకు సంబంధించి ఆర్కిటెక్చర్, సివిల్, కన్ స్ట్రక్షన్ విభాగాల్లో దేనిలో నైనా బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి.

మాస్టర్ ఆఫ్ ప్లానింగ్ కోర్సుకు సంబంధించి స్పెషలైజేషన్లుగా ఎన్విరాన్ మెంటల్ ప్లానింగ్ర, హౌసింగ్, రీజనల్ ప్లానింగ్, ట్రాన్స్ పోర్ట్ ప్లానింగ్, అర్బన్ ప్లానింగ్ వంటివి కలిగి ఉండాలి. అర్హత విషయానికి వస్తే ప్లానింగ్, ఆర్కిటెక్చర్, సివిల్ దేనిలోనైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా జాగ్రఫీ, ఎకనామిక్స్ , సోషియాలజీల్లో బ్చాచిలర్ డిగ్రీ, లేకుంటే ఎకనామమిక్స్, స్టాటిస్టిక్స్, ఆపరేషన్స్ రిసెర్చ్ ల్లో పీజీ కలిగి ఉన్నవారు అర్హలు.

ఫుల్ టైమ్ డాక్టొరల్ ప్రొగ్రామ్ లకు సంబందించి ప్లానింగ్, ఆర్కిటెక్చర్ లో 60శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలైతే 55శాతం ఉండాలి. గేట్, జేఆర్ఎఫ్, సీడ్ వీటిల్లో దేనిలోనైనా స్కోర్ కలిగి ఉండాలి. పరీక్షలో చూపిన ప్రతిభ, వైవా, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.

అభ్యర్ధులు దరఖాస్తులు పంపేందుకు చివరి తేది మార్చి 28,2022గా నిర్ణయించారు. దరఖాస్తు ఫీజు 2500 రూపాయలు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ : http://spa.ac.in సంప్రదించగలరు.