CAT 2023 : ఐఐఎంలు, బిజినెస్ స్కూళ్లలో ప్రవేశాలకు కామన్ అడ్మిషన్ టెస్ట్ CAT రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు !

మన్ అడ్మిషన్ టెస్ట్(CAT) ద్వారా దేశంలోని ఐఐఎంలు, బిజినెస్ స్కూళ్లలో ఎంబీఏ వంటి మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. క్యాట్‌ 2023కి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా స్ట్రీమ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

CAT 2023 : ఐఐఎంలు, బిజినెస్ స్కూళ్లలో ప్రవేశాలకు కామన్ అడ్మిషన్ టెస్ట్ CAT రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు !

Common Admission Test CAT

CAT 2023 : జాతీయ స్థాయిలో జరిగే ప్రతిష్టాత్మక ఎంట్రెన్స్ టెస్ట్‌ కామన్ అడ్మిషన్ టెస్ట్(CAT) దరఖాస్తు గడువు పొడిగించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-లక్నో, క్యాట్-2023 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 2 నుంచి ప్రారంభం కాగా.. సెప్టెంబర్ 13 చివరి తేదీగా ముందుగా నిర్ణయించారు. అయితే తాజాగా దరఖాస్తు గడువును మరో వారం రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దరఖాస్తు గడువు సెప్టెంబర్ 20 గా నిర్ణయించారు.

READ ALSO : Paddy Cultivation : వరిలో కాండంతోలుచు పురుగు నివారణ

కామన్ అడ్మిషన్ టెస్ట్(CAT) ద్వారా దేశంలోని ఐఐఎంలు, బిజినెస్ స్కూళ్లలో ఎంబీఏ వంటి మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. క్యాట్‌ 2023కి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా స్ట్రీమ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ విద్యార్థులు కనీసం 45 శాతం స్కోర్ చేసి ఉండాలి. చివరి సంవత్సరం గ్రాడ్యుయేషన్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోనేందుకు అర్హులు

READ ALSO : Poonam Kaur: చంద్రబాబు నాయుడు అరెస్టుపై హీరోయిన్ పూనమ్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు

జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.2,400 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.1,200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. క్యాట్ 2023 ఎంట్రెన్స్ టెస్ట్ నవంబర్ 26న మూడు సెషన్స్‌లో జరగనుంది. ఇందు కోసం దేశవ్యాప్తంగా 155 నగరాల్లో ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. అడ్మిట్‌కార్డులు అధికారిక పోర్టల్‌లో అక్టోబర్ 25 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ iimcat.ac.in లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

READ ALSO : Brinjal Farming : వంగతోటలకు మొవ్వు, కాయతొలుచు పురుగుల బెడద

దరఖాస్తు విధానం ;

ముందు అధికారిక పోర్టల్ iimcat.ac.in ఓపెన్ చేసి హోమ్ పేజీలోకి వెళ్లి, రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి. అనంతరం మరో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన పర్సనల్ వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి. ఆతరువాత రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయ్యి, క్యాట్-2023 అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయాలి. అన్ని వివరాలను ఎంటర్ చేయాలి. తరువాత అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫారమ్ సబ్‌మిట్ చేయాలి. భవిష్యత్తు అవసరాలకు ఒక కాపీని సేవ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవడం మంచిది.