Job Vacancy : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

అన్ లైన్ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్ధులు ఫీజు మినహాయింపు ఉంటుంది.

Job Vacancy : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Ubgi

Updated On : August 19, 2021 / 12:32 PM IST

Job Vacancy : భారత ప్రభుత్వరంగ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకోసం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ విభాగాల్లో 347 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ కోసం ధరఖాస్తులను స్వీకరించనున్నారు. ఖాళీల పూర్తి వివరాల విషయానికి వస్తే సీనియర్ మేనేజర్లు 60, మేనేజర్లు 141, అసిస్టెంట్ మేనేజర్లు 146 పోస్టులు ఉన్నాయి.

రిస్క్, సివిల్, ఇంజనీర్, ఆర్కిటెక్ట్, ఆర్కిటెక్ట్ ఇంజనీరింగ్, ప్రింటింగ్ టెక్నాలజిస్ట్, ఫోరెక్స్ తదితర విభాగాల్లో ఉన్న ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. విద్యార్హతలకు సంబంధించి అయా పోస్టులను బట్టి తదనుగుణంగా ఏదైనా గ్రాడ్యుయేషన్, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, ఎంబీఏ, సీఏ, సీఎంఏ, సీఎస్ ఉత్తీర్ణత సాధించటంతోపాటు అనుభవం కలిగి ఉండాలి.

అన్ లైన్ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్ధులు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఇతరులు 850 రూపాయలను ఫీజుగా చెల్లించాలి. ధరఖాస్తుకు చివరి తేది సెప్టెంబర్ 3గా నిర్ణయించారు. ధరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో స్వీకరిస్తారు. వివరాలకు వెబ్ సైట్ WWW.unionbankofindia.co.in/