Jobs : మౌలానా అజాద్ ఇన్ స్టిట్యూట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ

సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్స్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ,

Jobs : మౌలానా అజాద్ ఇన్ స్టిట్యూట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ

Jobs

Jobs : భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖ అధ్వర్యంలో నడుస్తున్న బోపాల్ లోని మౌలానా అజాద్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఏఏన్ఐటీ)లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. మొత్తం 170 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.

సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్స్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ తదితర విభాగాలకు సంబంధించి ఖాళీలు ఉన్నాయి. విద్యార్హతల విషయానికి వస్తే సంబంధిత సబ్జెక్టులో పీజీ డిగ్రీ, పీహెచ్ డీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం క్రెడిట్ పాయింట్ స్కోర్, రీసెర్చ్ అకడమిక్ ప్రతిభ అధారంగా అభ్యర్ధుల్ని ముందుగా షార్ట్ లిస్టు చేస్తారు. అనంతరం అభ్యర్ధుల ప్రజెంటేషన్, ఇంటర్వ్యూ, ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. జీత భత్యాలకు సంబంధించి నెలకు 70,900 నుండి 1,01,500 వరకు చెల్లిస్తారు. ధరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా అప్లై చేయాలి. ధరఖాస్తుకు చివరి గడువు సెప్టెంబర్ 15గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ HTTP://WWW.manit.ac.in/