APS GOLCONDA : హైదరాబాద్ గోల్కొండ ఆర్మీ స్కూల్ లో పోస్టుల భర్తీ

పోస్టుల వారిగా వివరాలను పరిశీలిస్తే ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు 6 ఖాళీలు, ప్రైమరీ టీచర్లు 5 ఖాళీలు, అడ్మిన్ సూపర్ వైజర్స్ 1 ఖాళీ, లైబ్రేరియన్ 1 ఖాళీ, సైన్స్ ల్యాబ్ అటెండెంట్ 1 ఖాళీ, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 2 ఖాళీలు ఉన్నాయి.

APS GOLCONDA : హైదరాబాద్ గోల్కొండ ఆర్మీ స్కూల్ లో పోస్టుల భర్తీ

Aps Golconda

APS GOLCONDA : కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్ధ అయిన హైదరాబాద్ లోని గోల్కొండ లో ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూల్ (ఎపీఎస్)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో టీచింగ్ , నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. పోస్టుల వారిగా వివరాలను పరిశీలిస్తే ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు 6 ఖాళీలు, ప్రైమరీ టీచర్లు 5 ఖాళీలు, అడ్మిన్ సూపర్ వైజర్స్ 1 ఖాళీ, లైబ్రేరియన్ 1 ఖాళీ, సైన్స్ ల్యాబ్ అటెండెంట్ 1 ఖాళీ, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 2 ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ పోస్టులకు కనీసం 60శాతం మార్కుటలతో గ్యాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. బీఈ డీ ఉత్తీర్ణత, సీటెట్, టెట్ అర్హులై ఉండాలి. ప్రైమరీ టీచర్ పోస్టులకు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ, ఎడ్యుకేషన్, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. సీటెట్, టెట్ అర్హులై ఉండాలి. మిగిలిన పోస్టులకు ఆయా పోస్టులను బట్టీ పదో తరగతి, ఇంటర్, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.

అభ్యర్ధులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులను పంపాల్సిన చిరునామా ; ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ, సన్ సిటీ దగ్గర, హైదరాబాద్ -500031, దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది జూన్ 6, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://www.apsgolconda.edu.in/ పరిశీలించగలరు.