Telangana Ayush Recruitment : తెలంగాణా ఆయుష్ విభాగంలో పలు పోస్టుల భర్తీ
అకడమిక్ మెరిట్, అనుభవం ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. అభ్యర్ధుల వయస్సు 18 నుండి 44 ఏళ్ల వరకు వయసు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు వేతనంగా రూ.54,220 నుంచి రూ.1,33,630 వరకు ఉంటుంది. ఆన్లైన్ ద్వారా ఈ పోస్ట్ లకు ధరకాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Telangana Ayush Recruitment
Telangana Ayush Recruitment : తెలంగాణా స్టేట్ వైద్యఆరోగ్యశాఖ ఆయుష్ విభాగంలో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 156 మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మెడికల్, హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నియామకాల ప్రక్రియను నిర్వహించనుంది. భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధించి ఆయుర్వేదంలో 54 హోమియోలో 33 యునానిలో 69 పోస్టులు గా విభజించారు.
READ ALSO : Kharif Kandi Cultivation : ఖరీఫ్ కందిలో అధిక దిగుబడులకోసం మెళకువలు
అకడమిక్ మెరిట్, అనుభవం ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. అభ్యర్ధుల వయస్సు 18 నుండి 44 ఏళ్ల వరకు వయసు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు వేతనంగా రూ.54,220 నుంచి రూ.1,33,630 వరకు ఉంటుంది. ఆన్లైన్ ద్వారా ఈ పోస్ట్ లకు ధరకాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు రూ.500 చెల్లించాలి, ప్రాసెసింగ్ ఫీజు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. అప్లికేషన్ ఫీజు మాత్రమే ఉంటుంది.
READ ALSO : Thalassemia Major: తలసేమియా మేజర్తో బాధపడుతున్న 13 ఏళ్ల కుమార్తెకు ఎముక మజ్జను దానం చేసిన తల్లి
ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 7 నుండి ప్రారంభమై ఆగస్టు 22వ తేదీ తో ముగుస్తుంది. కేవలం తెలంగాణ రాష్ట్రానికి చెందిన దరఖాస్తుదారులకు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm పరిశీలించగలరు.