NIDAP Recruitment : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ లో ఉద్యోగ ఖాళీలు భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనిర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పదో తరగతి, సంబంధత స్పెషలైజేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ/పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిప్లొమా/సంబంధిత విభాగంలో ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

NIDAP Recruitment : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ లో ఉద్యోగ ఖాళీలు భర్తీ

Vacancies in National Institute of Design

NIDAP Recruitment : కేంద్ర ప్రభుత్వ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిధిలోని గుంటూరు ఏఎన్‌యూ క్యాంపస్‌లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్ మొత్తం 23 ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, డిప్యూటేషన్, షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదిక భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో ప్రిన్సిపల్ డిజైనర్, సీనియర్ డిజైనర్, ప్రిన్సిపల్ టెక్నికల్ ఇన్‌స్ట్రక్టర్ తదితర పోస్టులు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనిర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పదో తరగతి, సంబంధత స్పెషలైజేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ/పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిప్లొమా/సంబంధిత విభాగంలో ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 50 నుంచి 56 యేళ్ల మధ్య ఉండాలి.

షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.25,000ల నుంచి రూ.2,15,900ల వరకు జీతంగా చెల్లిస్తారు. అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌ సెప్టెంబర్‌ 23, 2022వ తేదీన విడుదలైంది. 45 రోజుల్లోపు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్, ట్రాన్సిట్ క్యాంపస్: EEE బిల్డింగ్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, నాగార్జున నగర్, నంబూరు, గుంటూరు-522510. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://nid.ac.in/ పరిశీలించగలరు.