Gujarat Polls: రాహుల్ గాంధీని సద్దాం హుస్సేన్‭తో పోల్చిన అస్సాం ముఖ్యమంత్రి

బుధవారం రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల ఓ ప్రచార ర్యాలీలో హిమంత బిశ్వా శర్మ మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై స్పందించారు. ఈ సందర్భంలోనే రాహుల్‭ను సద్దాం హుస్సేన్‭తో పోల్చారు. యాత్రలో రాహుల్ గెడ్డం బాగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే అలా ఆయనను చూస్తుంటే సద్దాం హుస్సేన్‭లా కనిపిస్తున్నారని అన్నారు

Gujarat Polls: రాహుల్ గాంధీని సద్దాం హుస్సేన్‭తో పోల్చిన అస్సాం ముఖ్యమంత్రి

Rahul Gandhi looks like Saddam Hussein says Assam CM Himanta Sarma

Gujarat Polls: మామూలుగానే భారత రాజకీయాల్లో విమర్శలు హద్దు మీరి పోతుంటాయి. ఇక ఎన్నికల సమయంలో అయితే హద్దు అదుపు లేకుండా విమర్శలు చేస్తుంటారు. దేశంలో ప్రధాన పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య తరుచూ ఇలాంటి విమర్శలు, ఆరోపణలు కనిపిస్తూనే ఉంటాయి. ప్రస్తుతం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వా శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని సద్దాం హుస్సేన్‭తో ఆయన పోల్చారు.

బుధవారం రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల ఓ ప్రచార ర్యాలీలో హిమంత బిశ్వా శర్మ మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై స్పందించారు. ఈ సందర్భంలోనే రాహుల్‭ను సద్దాం హుస్సేన్‭తో పోల్చారు. యాత్రలో రాహుల్ గెడ్డం బాగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే అలా ఆయనను చూస్తుంటే సద్దాం హుస్సేన్‭లా కనిపిస్తున్నారని అన్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ నేతల తీరు భారతీయ సంస్కృతికి దూరంగా ఉంటాయని, వారు ఎల్లప్పుడూ విదేశీ ఇతరుల సంస్కృతులను స్వీకరించడానికే ప్రయత్నిస్తారంటూ విమర్శించారు. అంతే కాకుండా భారత్ జోడో యాత్రలో చేరడానికి బాలీవుడ్ తారలకు డబ్బులు ఇచ్చారని హిమంత బిశ్వా శర్మ ఆరోపించారు.

అయితే హిమంత బిశ్వా శర్మ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ప్రధాని నరేంద్రమోదీ ఏ సంస్కృతి ప్రకారం గెడ్డం పెంచుకున్నారని ప్రశ్నించింది. అయితే ప్రధాని గెడ్డం పెంచినప్పుడు తామేమీ అనలేదని, తమది అలాంటి సంస్కృతి కాదని అన్నారు. తాము దేశ సమస్యల గురించి మాట్లాడతామని, ప్రజల్ని పక్కదారి పట్టించే వాటి గురించి కాదని గట్టిగానే జవాబు చెప్పేందుకు ప్రయత్నించింది. ఇక రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో బీజేపీలో వణుకు పుట్టిందని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీపై కాంగ్రెస్ విరుచుకుపడింది.

Supreme Court: సుప్రీం కోర్టు నాలుగు ప్రత్యేక బెంచ్‭లు.. స్పష్టం చేసిన సీజేఐ