Tripura Assembly Polls: పోలింగ్ స్టేషన్ల ముందు బారులు తీరిన ఓటర్లు.. త్రిపురలో ఘనంగా కొనసాగుతున్న పోలింగ్

త్రిపుర వ్యాప్తంగా 3,337 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 1100 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా, 28 పోలింగ్ కేంద్రాలు అతి సమస్యాత్మకంగా గుర్తించారు. ఆయా కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. పోలింగ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నిషేదాజ్ఞలు విధించారు. కాగా, 2018లో రాష్ట్రానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 91.38 శాతం పోలింగ్ నమోదైంది.

Tripura Assembly Polls: పోలింగ్ స్టేషన్ల ముందు బారులు తీరిన ఓటర్లు.. త్రిపురలో ఘనంగా కొనసాగుతున్న పోలింగ్

Voters lined up in front of the polling stations. Polling is going on in Tripura

Tripura Assembly Polls: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ.. సాయంత్రం 4గంటల వరకు కొనసాగుతుంది. అయితే రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. త్రిపుర ఓటర్లు పోలింగ్ స్టేషన్ల ముందు బారులు తీరారు. ఉదయం 11 గంటల వరకే రాష్ట్ర వ్యాప్తంగా 32.06 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. 2018లో రాష్ట్రానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 91.38 శాతం పోలింగ్ నమోదైంది. అయితే ఆ రికార్డును తాజా పోలింగ్ బద్ధలు కొడుతుందా అనేది చూడాలి.

Pakistan: పాకిస్తాన్‭లో రికార్డ్ స్థాయికి పెరిగిన పెట్రోల్ ధరలు.. ఒక్క లీటర్ ఎంతో తెలుసా?

త్రిపుర వ్యాప్తంగా 3,337 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 1100 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా, 28 పోలింగ్ కేంద్రాలు అతి సమస్యాత్మకంగా గుర్తించారు. ఆయా కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. పోలింగ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నిషేదాజ్ఞలు విధించారు. 17వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు నిషేదాజ్ఞలు అమల్లో ఉంటాయని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర మాణిక్ సాహా పోలింగ్ ప్రారంభమైన కొద్ది సమయానికే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర రాజధాని అగర్తలాలో ఆయన తన ఓటు వేశారు.

Mayawati: యోగి బుల్డోజర్లతో ప్రజల ప్రాణాలు పోతున్నాయి.. కాన్పూర్ దేహాత్ ఘటనపై మాయావతి ఆగ్రహం

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో 13.55లక్షల మంది మహిళలతో సహా మొత్తం 28.13లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 60 స్థానాల్లో 259 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ఇందులో 20 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ – ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ), సీపీఎం – కాంగ్రెస్ కూటములతో పాటు ప్రాంతీయ పార్టీ అయిన తిప్రా మోతా ప్రధాన పోటీదారులుగా బరిలో ఉన్నాయి. బీజేపీ 55 స్థానాల్లో పోటీ చేస్తుండగా, దాని మిత్రపక్షం ఐపీఎఫ్టీ ఆరు స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇందులో ఒక స్థానం స్నేహపూర్వక పోటీ ఉంటుంది. అదేవిధంగా సీపీఐ (ఎం) 47 స్థానాల్లో పోటీ చేయగా, దానికూటమి భాగస్వామ్య పక్షం కాంగ్రెస్ 13 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక తిప్రామోథ 42 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. తృణమూల్ కాంగ్రెస్ 28 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపగా, 58 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.