ఇండియాలో కరోనా‌వైరస్ : నిజంగా మనం మాస్క్ వేసుకోవాలా?

  • Published By: sreehari ,Published On : March 4, 2020 / 07:25 AM IST
ఇండియాలో కరోనా‌వైరస్ : నిజంగా మనం మాస్క్ వేసుకోవాలా?

చైనా చీప్ సరుకుల కన్నా వేగంగా కరోనా ప్రపంచాన్ని కమ్మేస్తోంది. ఇరాన్ పక్కనుందికాబట్టి కరోనా వచ్చిందనుకోవచ్చు. అంతకన్నా తీవ్రంగా ఇటలీ కరోనా బారినపడింది. కరోనాకు చైనా మెయిన్ సెంటరైతే ఇటలీ రీజనల్ సెంటర్‌లా యూరోప్‌ను భయపెడుతోంది. అడ్డుకొంటామన్న ట్రంప్ కూడా వ్యాక్సిన్ కోసం తెగ తాపత్రయపడుతున్నారు.  ప్రపంచం మొత్తం మాస్క్ వేసేసుకుంది. సర్జికల్ మాస్క్ వేసుకొంటే సేఫ్ అని జనం అనుకొంటారు. మరి ఇదెంతవరకు నిజం?

ఫేస్‌మాస్క్‌తో కరోనాను అడ్డుకోవచ్చా? జనం నమ్మకం అదే. అందుకే వందల కొద్దీ మాస్క్‌లను కొని, దాచుకొంటున్నారు. ఒక స్టూడెంట్ పేరెంట్‌కు కరోనా వచ్చిందని రెండు స్కూల్స్ మూతపడ్డాయి. ఢిల్లీలో కరోనా‌మాస్క్ అంటే సర్జికల్‌మాస్క్‌లను బ్లాక్‌లో అమ్ముతున్నారు. హాంగ్‌కాంగ్‌లో తుపాకులతో బెదిరించి మరీ మాస్క్‌లను ఎత్తుకెళ్తున్నారు. డబ్బుకన్నా మాస్క్‌లకు వేల్యూ ఎక్కువ. అంతెందుకు  ఫ్రాన్స్‌ హాస్పటిల్‌లో 2,000 మాస్క్‌లను ఎవరో ఎత్తుకెళ్లారు. అందుకే అమెరికాలోని సర్జిన్ జనరల్, మాస్క్ లను కొనకండి అని ట్వీట్ చేశారు.

జనం హడావిడి చూస్తుంటే మాస్క్ లేకపోతే కరోనాకి బలైనట్టేనా?
ఇప్పుడు వాస్తవం దగ్గరకొద్దాం.  మనమున్న ప్రాంతంలో కరోనా వైరస్, లేదంటే దగ్గర్లో కరోనా పేషెంట్ ఉంటే తప్ప మాస్క్ వేసుకోవాల్సిన అవసరంలేదని World Health Organisation (WHO) తేల్చేసింది. ఒకవేళ మీకు జ్వరం, దగ్గు, ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మాస్క్ వేసుకోవలి, డాక్టర్ ను కలవాలి. ప్రపంచ ఆరోగ్యసంస్థ WHO’s coronavirus page పేజీలో ఎవరు మాస్క్ లు వేసుకోవాలి? ఎలా వాడాలో చెప్పింది. జాగ్రత్తగా చూడండి.

surgical (or medical) masks వాడినంత మాత్రానా కరోనావైరస్ నుంచి మీరు రక్షించుకోలేరు.  చెప్పినట్లు రోగులకు దూరంగా ఉండటం, వైరస్ ఉన్న వాటిని టచ్ చేయకుండా ఉండటం ముఖ్యం. N95 వాడితే గాలిలోంచి వచ్చే వైరస్ ను అడ్డుకోవచ్చు. ఒకవేళ సరిగా వేసుకోకుండా, మాస్క్ ఉందికదాని అనుకొంటే అది మరీ ప్రమాదం.
 
ఇప్పుడు అంతకన్నా పెద్ద సమస్య ఏంటంటే,  ఇప్పుడు వైద్యనిపుణులకు, అవసరమైన వాళ్లకు మాస్క్ లు దొకరడం లేదు… ఒట్టి భయంతో చాలామంది కొనేసుకొని మాస్క్ లను బంగారం దాచుకొంటున్నారు. ఇదే పెద్ద సమస్య. అంతెందుకు మాస్క్ ల రేట్లు మూడింతలు పెరిగాయి.