Ghee : నెయ్యి తినటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుందా?..

అయుర్వేదం ప్రకారం నెయ్యి సాత్విక అహారం. జ్ణాపక శక్తిని పెంచటంలో నెయ్యి కీలకమైన పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Ghee : నెయ్యి తినటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుందా?..

Ghee

Ghee : పాల నుండి లభించే వెన్నను కరిగించగా వచ్చే ఒక విధమైన కొవ్వ పదార్ధాన్నే మనం నెయ్యి అంటాం. ఈ నెయ్యిని తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. వంటలతోపాటు, అహారపదార్ధాలను తినే సమయంలో నెయ్యిని వినియోగిస్తుంటాం. నెయ్యి శరీరానికి ఎన్నో రకాల పోషకాలను అందిస్తుంది. రోగ నిరోధక వ్యవస్ధను బలోపేతం చేసేందుకు నెయ్యి ఎంతగానో ఉపకరిస్తుంది. రోజుకు రెండు మూడు స్పూన్ల నెయ్యి తీసుకోవటం వల్ల శరీర వ్యవస్ధ మొత్తాన్ని సమన్వయపరుస్తుంది.

నెయ్యి తీసుకోవటం వల్ల బరువు పెరుగుతారని చాలా మంది నెయ్యిని తీసుకునేందుకు ఇష్టపడరు. అలాంటి ఆలోచనతో నెయ్యిని దూరంగా పెట్టటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోవలసి వస్తుంది. నెయ్యి కరిగించినప్పుడు సువాసన, రుచి కలిగిస్తుంది. నెయ్యిలో కొవ్వుల్లో దొరకని విటమిన్ ఎ,డి,ఇ,కెలు సమృద్ధిగా లభిస్తాయి.

అయుర్వేదం ప్రకారం నెయ్యి సాత్విక అహారం. జ్ఞాపకశక్తిని పెంచటంలో నెయ్యి కీలకమైన పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తెలివి తేటలను పెంచటంలో కూడా ఇది ఎంతగానో దోహదపడుతుందట. అంతేకాదు జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. రోజుకు రెండు,మూడు టీస్పూనులకు మించి నెయ్యిని తీసుకోవటం హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నెయ్యిని అధికంగా తీసుకునేవారు ఎక్కవగా హృద్రోగ సంబంధింత వ్యాధులతో బాధపడుతున్నట్లు పరిశోధనల్లో తేలింది.

నెయ్యిలో సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన ఫ్రీరాడికల్స్ ను బయటకు పంపి చర్మాన్ని యవ్వనంగా కాంతివంతంగా మారుస్తుంది. అదే క్రమంలో అధిక మోతాదులో కుండా తక్కువ పరిమాణంలో నెయ్యి తీసుకోవటం వల్ల శరీర బరువు తగ్గటానికి ఉపకరిస్తుందట.

ఇన్ని ప్రయోజనాలు దాగివున్న నెయ్యిని ప్రతిరోజు ఆహారంలో రోజుకు రెండు మూడు స్పూన్పులు తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందట. నిపుణుల సూచనలు తీసుకుని తగినంత పరిమాణంలో నెయ్యిని తీసుకోవటం వల్ల చక్కని ఆరోగ్యాన్ని పొందేందుకు అవకాశం ఉంది.