Gas Problem : సాధారణ కడుపు నొప్పిని నిర్లక్ష్యం చేయకండి? గ్యాస్ సమస్య గుండెపోటుకు దారితీసే ప్రమాదం

మైనర్ గ్యాస్ కూడా గుండెపోటుకు కారణం కావచ్చు. ఇది మాత్రమే కాదు, ఒక కొత్త అధ్యయనం ప్రకారం, మలబద్ధకం, TB , పేగు క్యాన్సర్‌కు దారి తీస్తుంది. ఈ సమస్యలన్నింటినీ నివారించాలనుకుంటే, ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించటం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం అవసరం.

Gas Problem : సాధారణ కడుపు నొప్పిని నిర్లక్ష్యం చేయకండి? గ్యాస్ సమస్య గుండెపోటుకు దారితీసే ప్రమాదం

stomach pain symptoms

Gas Problem : ప్రస్తుతం కడుపునొప్పి సమస్య సర్వసాధారణమైపోయింది. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ఈ రోజుల్లో చాలా మంది కొద్దిపాటి కడుపు నొప్పిని నిర్లక్ష్యం చేయటం మనం చూస్తుంటాం. ఇది జీర్ణక్రియ సమస్యగా మాత్రమే పరిగణిస్తారు. కొంతసమయం తర్వాత దానంతట అదే తగ్గుతుందని భావిస్తారు.

READ ALSO : Bloating And Gas : వేసవిలో ఈ ఆహారాలు తీసుకుంటే కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు తెలుసా ?

ఈ నిర్లక్ష్యపు ఫలితమే దేశంలో 100 మందిలో 99 మంది గ్యాస్ ఎసిడిటీ, అజీర్తితో బాధపడుతున్నారు. అజీర్ణం అనేది సాధారణ రోజువారీ సమస్యగా అనిపించినప్పటికీ, నిర్లక్ష్యం చేస్తే అది పెద్ద సమస్యలకు, చివరకు గుండెపోటుకు కూడా దారి తీస్తుంది. ఇది అల్సర్లు, ఐబిఎస్, పెద్దప్రేగు శోథ, మధుమేహం, నిరంతర మలబద్ధకం వంటి ప్రమాదకరమైన వ్యాధులుగా కూడా మారవచ్చు.

మైనర్ గ్యాస్ కూడా గుండెపోటుకు కారణం కావచ్చు. ఇది మాత్రమే కాదు, ఒక కొత్త అధ్యయనం ప్రకారం, మలబద్ధకం, TB , పేగు క్యాన్సర్‌కు దారి తీస్తుంది. ఈ సమస్యలన్నింటినీ నివారించాలనుకుంటే, ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించటం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం అవసరం. తీపిపదార్ధాలు, వేయించిన ఆహారాన్ని తింటుంటే, దానిని ఒక పరిమితిలో మాత్రమే తీసుకోవాలి. అలాగే రోజువారిగా యోగా , ఇతర శారీరక వ్యాయామాలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

READ ALSO : Mulberry Fruit : గ్యాస్,కడుపు ఉబ్బరం…మల్బరీ పండ్లతో

అతిగా తిన్నప్పుడు లేదా ఏమి తింటున్నారో పట్టించుకోనప్పుడు గ్యాస్ పెయిన్, అసిడిటీ, అజీర్ణం, కడుపునొప్పి, కండరాలు పట్టేయడం వంటి సమస్యలు తలెత్తుతాయి. మన దేశంలో అజీర్ణం అతిపెద్ద జీర్ణక్రియ సమస్య. అసిడిటీ, గ్యాస్, మలబద్ధకం, లూజ్ మోషన్, పెద్దప్రేగు శోథ, అల్సర్ , ఉబ్బరం వంటి ఇబ్బందులను కలిగిస్తుంది.

ఈ సమస్యలను నివారించడానికి దినచర్యలో సులభమైన ఇంటి నివారణ జీవనశైలి చిట్కాలను అనుసరించటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయాన్నే నిద్రలేచిన తరువాత గోరువెచ్చని నీళ్లు తాగాలి. 1 నుండి 2 లీటర్ల నీరు ఒకేసారి త్రాగాలి. నీటిలో కొంచెం కల్లు ఉప్పు, నిమ్మరసం కలుపుకోవాలి. నీరు త్రాగిన తర్వాత 5 నిమిషాలు వాకింగ్, జాగింగ్ వంటి చిన్నపాటి వ్యాయామాలు చేయాలి. దీంతో విరోచనం సాఫీగా ఉంటుంది. గ్యాస్ వంటి సమస్యలు తొలగిపోతాయి.

READ ALSO : Magnesium : నిద్రలేమి సమస్యలను దూరం చేసే మెగ్నీషియం! రోజువారిగా శరీరానికి ఎంత అవసరమంటే?

మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు బొప్పాయి, ఆపిల్, దానిమ్మ మరియు పియర్ వంటి పండ్లు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మరోవైపు, క్యారెట్, బీట్‌రూట్, జామకాయ, బచ్చలికూర మరియు టమోటాతో చేసిన రసం జీర్ణసమస్యలకు ఉపయోగకరంగా ఉంటుంది.