Protect The Lungs : విషపూరితాల నుండి ఊపిరితిత్తులను కాపాడుకునేందుకు ఉపకరించే పానీయాలు ఇవే !
అల్లం , పసుపు రెండూ శక్తివంతమైన రోగ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. పానీయాల రూపంలో కలిపి తీసుకున్నప్పుడు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో గణనీయంగా దోహదపడతాయి.

lungs from toxins
Protect The Lungs : పెరుగుతున్న వాయు కాలుష్య స్థాయిలు,నిశ్చల జీవనశైలి కారణంగా ఊపిరితిత్తులు నిరంతరం హానికరమైన టాక్సిన్స్‌కు గురవుతున్నాయి. వీటి కారణంగా చాలా మంది శ్వాసకోశ రుగ్మతలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవటం చాలా కీలకం. మన ఊపిరితిత్తులను సహజ సిద్ధంగా శుభ్రపరచడానికి కొన్ని పానీయాలు ఎంతగానో దోహదపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి పానీయాలేంటో ఈ కధనం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
READ ALSO : Road Accident : డ్రంకెన్ డ్రైవ్ నిండు ప్రాణం తీసింది.. మద్యం మత్తులో అతివేగంగా కారు నడుపుతూ యాక్సిడెంట్
ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడే పానీయాలు ;
మూలికల టీ ; హెర్బల్ టీలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీర ఆరోగ్యానికి ఇవి ఎంతగానో మేలు చేస్తాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు ఊపిరితిత్తులను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి దోహదం చేసే వాటిలో హెర్బల్ టీలలో గ్రీన్ టీ, అల్లం టీ , పిప్పరమెంటు టీ లు ఉన్నాయి.
తాజా నిమ్మ నీరు ;
ఉదయం సమయంలో నిమ్మరసం తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకు డిటాక్సిఫైయింగ్ డ్రింక్‌గా ఉపయోగపడుతుంది. అంటే ఊపిరితిత్తులకు హాని కలిగించే విషతుల్యాలను బయటకు పంపేందుకు సహాయపడుతుందన్నమాట. నిమ్మకాయలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇది టాక్సిన్స్ ను తొలగించటంలో సహాయపడుతుంది. తద్వారా ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపడుతుంది. అంతేకాకుండా శ్వాసకోశ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.
READ ALSO : Anti Aging Foods : వృద్ధాప్య ప్రభావం మీ మెదడుపై పడకుండా ఆరోగ్యంగా ఉంచడానికి 5 ఆహారాలు !
క్యారెట్ రసం ;
క్యారెట్ జ్యూస్, విటమిన్లు A, C, మరియు K తోపాటు కొన్ని యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది అసాధారణమైన ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. క్యారెట్ రసాన్ని రోజువారీగా తీసుకోవటం వల్ల ఊపిరితిత్తులను శుభ్రపరిచే ప్రక్రియలో గణనీయంగా సహాయపడుతుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పెంచుతుంది.
అల్లం , పసుపు పానీయం ;
అల్లం , పసుపు రెండూ శక్తివంతమైన రోగ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. పానీయాల రూపంలో కలిపి తీసుకున్నప్పుడు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో గణనీయంగా దోహదపడతాయి. పురాతన కాలం నుండి శ్వాసకోశ సమస్యలకు తగ్గించుకునేందుకు ఇవి రెండు ప్రభావవంతంగా పనితీరు కనబరుస్తున్నాయి. ఊపిరితిత్తుల సహజ ప్రక్షాళనలో ఇవి రెండు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
READ ALSO : Heart Health : రోజుకు 11 నిమిషాలు నడిస్తే చాలు.. గుండె ఆరోగ్యం భేష్
అవసరమైన పోషకాలు మరియు యాంటీఆక్సిడెంట్లతో నిండిన ఈ ప్రయోజనకరమైన పానీయాలన్నీ సహజ సిద్ధంగా ఊపిరితిత్తులలోని విషతుల్యాలను తొలగించటంలో సహాయపడతాయి. రోజువారీగా ఈ పానీయాలను తీసుకోవటం వల్ల నిస్సందేహంగా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. అంతేకాకుండా మొత్తం శరీర ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు. పానీయాలు ఊపిరితిత్తులను శుభ్రపరచడానికి దోహదపడతాయి. వీటికి తోడుగా శారీరక శ్రమ, సమతుల్య ఆహారాన్ని తీసుకోవటం మంచిది. శ్వాసకోశ సంబంధ సమస్యలు ఉత్పన్నం అయిన వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.
గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం అందించటమైనది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు వైద్యులను సంప్రదించి వారిచ్చే సూచనలు, సలహాలు పాటించటం మంచిది.