Satisfied After A Meal : భోజనం తర్వాత మానసికంగా మరింత సంతృప్తి చెందాలంటే ?

భోజనం చేసిన తర్వాత కూడా ఆకలి లేకుండా సంతృప్తిగా ఉండాలంటే ప్రోటీన్-ప్యాక్డ్ మీల్స్ ఒక ఖచ్చితమైన మార్గం. భోజనానికి ప్రోటీన్ , ఫైబర్ జోడించటం వల్ల మరింత సంతృప్తి చెందడానికి సహాయపడుతుంది. కడుపు నిండుగా ఉందని తెలియజేయడానికి మెదడుకు భౌతిక సంకేతాలను పంపుతుంది

Satisfied After A Meal : భోజనం తర్వాత మానసికంగా మరింత సంతృప్తి చెందాలంటే ?

satisfied after a meal

Satisfied After A Meal : మన శరీర సంరక్షణకోసం మనం ఎంతగా కృషి చేస్తున్నామో, మన మానసిక క్షేమం కూడా అంతే ముఖ్యం. భోజనం సంతృప్తిగా చేయలేదని, అసంతృప్తి భోజనం తో ముగించానని చాలా మంది అనేక సందర్భాల్లో భావించి ఉంటారు. ఆహారం అన్నది మన శారీరక ఆకలిని తీర్చడం మాత్రమే కాదు. భోజనం చేసిన తర్వాత మన మానసిక సంతృప్తిని కలిగించేలా ఉండాలి. ఇష్టమైన ఆహారాన్ని తీసుకున్న తర్వాత మరింత సానుకూలంగా, సంతృప్తి చెందడానికి కొన్ని మార్గాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన ప్రతిసారీ శరీరం మరియు మనస్సు రెండింటినీ సంతృప్తిపరచలాన్నదానిపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

READ ALSO : Bloating : ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నాకడుపు ఉబ్బరంగా ఉంటుందా? ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా?

ఆహారం నిజమైన ఆనందానికి పునాది, కాబట్టి ఆహారం అనేది సార్వత్రిక అనుభవం. సంతృప్తికరమైన భోజనం తర్వాత కూడా కొన్నిసార్లు ఇంకా ఎక్కువ తినాలన్న కోరికను కలిగి ఉంటాం. నిండుగా ఉన్న అనుభూతికి తృప్తిగా అనిపించడం కీలకం. కడుపు నిండిన అనుభూతి అనేది ఒక శారీరక అనుభూతి, అయితే సంతృప్తి చెందడం అనేది ఒక భావోద్వేగం. కోరికలకు లొంగిపోయి, హృదయం కోరుకునే వాటిని తిన్నప్పుడు ఇది జరుగుతుంది. దీనికి క్రిందకు అనేక అంశాలు వస్తాయి.

భోజనం తర్వాత మానసికంగా మరింత సంతృప్తి చెందడానికి మార్గాలు:

1. నెమ్మదిగా ఆహారం తీసుకోండి ; ఆహారం తీసుకోవటానికి తగిన సమయం కేటాయించటంతోపాటు తినే ఆహారంపై శ్రద్ధ పెట్టండి. పని కార్యకలాపాల మధ్య హడావిడిగా భోజనం చేయడం, ఫోన్‌ సంభాషణల మధ్య, పరధ్యానంగా కూర్చొని భోజనం చేయడం తిన్న ఆనందాన్ని లేకుండా చేస్తుంది. దీనివల్ల మరింత ఎక్కువ కావాలనే ఫీలింగ్ కలుగుతుంది. దీనికి బదులుగా, ప్రశాంతంగా ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా తినే ఆహారంపై దృష్టిపెట్టాలి. నిధానంగా తినండి. వంటకాల రుచులు, వాసనను ఆస్వాదించండి.

2. సహజమైన ఆహారాన్ని తీసుకోండి ; సహజమైన ఆహారంగా శరీరం కోరుకునే వాటిని తినడం మాత్రమే కాదు, సంపూర్తి అనే అనుభూతిని కూడా పొందుతుంది. పాస్తాను తినాలని కోరుకుంటే బరువు పెరుగుతామన్న ఆలోచన ఉంటే అధిక మొత్తంలో కాకుండా కొద్ది మొత్తంలో తీసుకోవటం మంచిది. అలా కాకుండా అధికమోతాదులో తీసుకుంటే విపరీతమైన పరిణామాలకు దారి తీస్తుంది.

READ ALSO :  Blood Circulation : శరీరానికి సరైన రక్త ప్రసరణ కోసం ఆహారంలో మార్పులు తప్పదా ?

3. తగినంత ప్రోటీన్ తీసుకోండి ; భోజనం చేసిన తర్వాత కూడా ఆకలి లేకుండా సంతృప్తిగా ఉండాలంటే ప్రోటీన్-ప్యాక్డ్ మీల్స్ ఒక ఖచ్చితమైన మార్గం. భోజనానికి ప్రోటీన్ , ఫైబర్ జోజోడించడం వల్ల మరింత సంతృప్తి చెందడానికి సహాయపడుతుంది. కడుపు నిండుగా ఉందని తెలియజేయడానికి మెదడుకు భౌతిక సంకేతాలను పంపుతుంది. అందుకే ఆపిల్, పీనట్ బటర్ వంటి కలయికలు కేవలం యాపిల్ కంటే ఎక్కువ సంతృప్తికరంగా ఉంటాయి.

4. నిర్బంధ ఆహారాలకు దూరంగా ఉండండి ; అందమైన శరీరాకృతికోసం కొంతమంది అనేక పరిమితులు ఉండే ఆహారాన్ని తీసుకుంటారు. ఇష్టమైన ఆహారాన్ని నివారించమని మన మనస్సును బలవంతం చేస్తారు, ఇది చివరికి నిరాశకు దారితీస్తుంది. అంతేకాకుండా తినడం తర్వాత సంతృప్తి లేకపోవడం వంటి ఫీల్సింగ్స్ కలుగుతాయి. ఇష్టమైన వాటిలో కొన్నింటిని డైట్ప్లా న్‌లో చేర్చుకోండి. వాటిలో కొన్నింటిని తీసుకోవటం వల్ల మిమ్మల్ని శారీరకంగా సంతృప్తిపరచడమే కాకుండా మానసికంగా నరాలను శాంతపరచడంలో, అవసరమైన సౌకర్యాన్ని అందించడంలో దోహదపడుతుంది.

READ ALSO : Women’s Health : మహిళల ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారం అవసరమంటే ?

5. 80/20 నియమాన్ని అనుసరించండి ; పిండి పదార్థాలు , మీకు ఇష్టమైన ఆహారాలను తినకుండా మానుకునే బదులుగా, 80/20 నియమాన్ని అనుసరించండి. ఈ నియమం 20% ఇష్టమైన ఆహారాలకు , 80% మంచి పోషకాలకు కేటాయిస్తుంది. పోషకాల సమతుల్యతను కాపాడుకుంటూ జంక్ ఫుడ్ తీసుకోకుండా ఉండటానికి ఇది ఒక అద్భుతమైన పద్ధతి. దీనివల్ల పోషకాలను అలాగే మీకు ఇష్టమైన స్వీట్‌లను తినవచ్చు. ఇది మీ ఆహారం పట్ల తక్కువ నిరాశను కలిగిస్తుంది.

ప్రతిసారి భోజనం తర్వాత సంతృప్తి అనుభూతి చెందకపోవడం చాలా సాధారణం. వాస్తవానికి చాలా సార్లు భోజనం తరువాత ఇదే జరుగుతుంది. బరువు పెరుగుతామన్న ఆందోళనలు ఉంటే రుచికరమైన ఆహారాలను మార్చటం మంచిది. భోజనం తర్వాత పళ్ళు తోముకోవడం వంటి ఒక సాధారణ అలవాటు వల్ల మెదడుకు ఇన తినటం ముగిసిందని సూచిస్తుంది, ఇది దృష్టిని మళ్లిస్తుంది. కోరికలను తగ్గిస్తుంది. ఇలాంటి చిట్కాలు క్యాలరీలను అదుపులో ఉంచుకోవడంతోపాటు, సంతృప్తిగా ఉండేలా చేస్తాయి.