Hemophilia B: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషదం విడుదల.. ధర ఎంతో తెలుసా?

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ ఔషధం.. రక్తం గడ్డకట్టడంలో వచ్చే అరుదైన సమస్యలకు జన్యుపరమైన చికిత్సకు ఉపయోగిస్తారు. ప్రపంచం వ్యాప్తంగా ప్రతి 40 వేల మందిలో ఒకరు ఈ జబ్బు కారణంగా బాదపడుతున్నారు. కాలేయంలో ఉత్పత్తి అయ్యే ఫ్యాక్టర్-9 అనే ప్రొటీన్ లోపం కారణంగా ఈ సమస్య ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు

Hemophilia B: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషదం విడుదల.. ధర ఎంతో తెలుసా?

World’s Most Expensive Drug Approved to Treat Hemophilia

Hemophilia B: ‘హిమోఫిలియా బీ’ అనే ఆరోగ్య సమస్యకు సరికొత్త ఔషధం విడుదలైంది. ఈ ఔషధం ప్రత్యేకత ఏంటంటే.. ప్రపంచంలో ఇదే అత్యంత ఖరీదైన ఔషదం. రక్తానికి సంబంధించిన సమస్య కోసం తయారు చేసిన ఈ ఔషదానికి ఇటీవలే అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‭డీఏ ఆమోదముద్ర వేసింది. ఆస్ట్రేలియాకు చెందిన ‘సీఎస్ఎల్ లిమిటెడ్’ అనే సంస్థ తయారు చేసిన ఈ ఔషధ ధర ఒక డోసుకు 3.5 మిలియన్ డాలర్లట. మన దేశ కరెన్సీలో చూసుకుంటే సుమారు 28.6 కోట్ల రూపాయలు అన్నమాట.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ ఔషధం.. రక్తం గడ్డకట్టడంలో వచ్చే అరుదైన సమస్యలకు జన్యుపరమైన చికిత్సకు ఉపయోగిస్తారు. ప్రపంచం వ్యాప్తంగా ప్రతి 40 వేల మందిలో ఒకరు ఈ జబ్బు కారణంగా బాదపడుతున్నారు. కాలేయంలో ఉత్పత్తి అయ్యే ఫ్యాక్టర్-9 అనే ప్రొటీన్ లోపం కారణంగా ఈ సమస్య ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఈ సమస్యకు ఇప్పటికే కొన్ని రకాల ఔషధాలు ఉన్నప్పటికినీ, తాజా మందు దీర్ఘకాలంగా పని చేస్తుందని తయారీ దారులు అంటున్నారు.

Supreme Court: మీకు అనుకూలంగా ఉంటే నియమిస్తారా? కేంద్ర ఎన్నికల కమిషనర్ నియామకంపై కేంద్రాన్ని నిలదీసిన సుప్రీం