Gold Idli : 24 క్యారెట్ల బంగారంతో చేసిన ఇడ్లీ .. ధర ఎంతో తెలుసా..?
హైదరాబాద్ లో బిర్యానీ, హలీమ్ లాంటి విభిన్నమైన రుచులే కాదు తాజాగా హైదరాబాద్ ఆహారంలో గోల్డ్ ఇడ్లీ హల్ చల్ చేస్తోంది. గోల్డ్ ఇడ్లీ నగరం అంతా హాట్ టాపిక్ గా మారింది.

Gold Idli
24 carat Gold Idli : ప్లేటు ఇడ్లీ ధర ఎంత ఉంటుంది..?ఓ రూ.30లు లేదా రూ.50 ఇంకా చెప్పాలంటే ఓ రూ.100 అనుకుందాం.కానీ హైదరాబాద్ లో బంజారాహిల్స్ లోని ఓ కేఫ్ లో మాత్రం ఇడ్లీ ఖరీదు అక్షరాలా రూ.200 రూపాయలు. మరీ అంత స్పెషల్ ఏముంది దాంట్లో అంటారా..? ముందే చెప్పాం కదా..బంగారం ఇడ్లీ అని..24 క్యారట్ల స్వచ్ఛమైన బంగారంతో అంటే బంగారం పూతతో తయారు చేసిన ఇడ్లీ924 carat ‘Gold Idli’)..మరి ఆ మాత్రం రేంజ్ ఉండాలి కదా..
హైదరాబాద్ (Hyderabad)లో ఆహార ప్రియులకు వందలు కాదు వేలాది రకాలు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ అంటేనే చారిత్రాత్మకమైనదే కాదు విభిన్న మైన రుచులకు ప్రసిద్ధి చెందింది. హైదరాబాద్ అంటే మనకు ఠక్కున గుర్తుకొచ్చేది బిర్యానీ. ఎన్నో వందల రకాల బిర్యాలకు కేరాఫ్ అడ్రస్ భాగ్యనగరం. అలాగే హలీమ్..హైదరాబాద్ లో హలీమ్ కు ఉండే టేస్ట్ మరెక్కడా ఉండదంటే అతిశయోక్తి కాదు. అటువంటి హైదరాబాద్ రుచుల్లో తాజాగా ‘బంగాం ఇడ్లీ’కూడా చేరింది.
Petrol Price Hike: బాబోయ్.. పాకిస్థాన్‌లో భారీగా పెరిగిన ఇంధన ధరలు.. ఇప్పుడెంతో తెలుసా?
గోల్డ్ ఇడ్లీ.. ఇది నగరం అంతా హాట్ టాపిక్ గా మారింది.వావ్ గోల్డ్ ఇడ్లీ అంట అంటూ అందరు వింతగా చెప్పుకుంటున్నారు. అసలు ఈ ఇడ్లీ స్పెషాలిటీ ఏంటి? దీంట్లో బంగారంతో పాటు ఇంకా ఏమేమి ఉన్నాయో తెలసుకుందాం..
24 క్యారెట్స్ గోల్డ్ ఇడ్లీకి బంగారు పూత పూత పూసారు నిర్వాహకులు. బంగారు పూత కలిగిన ఇడ్లీ అంటే సర్వింగ్ డెకరేషన్ కూడా ఆ రేంజ్ లో ఉండాలి కదా..తాజా గులాబీ రేకులతో చాలా కలర్‌ఫుల్‌గా గార్నిష్‌తో చేసి మరీ సర్వ్ చేస్తారు. ఈ డిఫరెంట్ ఇడ్లీని టేస్ట్ చేయాలంటే బంజారాహిల్స్(Banjara Hills)లోని కృష్ణ (Krishna cafe)ఇడ్లీ అండ్ దోస కేఫ్‌కు వెళ్లాల్సిందే..
ఇక్కడ గోల్డ్ ఇడ్లీయే కాదు..గోల్డ్ దోశ(gold dosa), గులాబ్ జామూన్ బజ్జీ(gulab jamun bhajji), మలై ఖోవా (malai khowa )గులాబ్ జామున్ (malai khowa gulab jamun bun)వంటి వెరైటీ వెరైటీ రుచులు నోరూరిస్తాయి. రోజు చేసే బ్రేక్ ఫాస్ట్ కాస్త డిఫరెంట్ చేయాలనుకునేవారికి విభిన్నమైన రుచులను అందిస్తోంది కృష్ణకేఫ్. ఆకాగా కేఫ్ కు నగరంలో కింగ్ కోఠి,సింకిద్రాబాద్ లలో బ్రాంచీలు కూడా ఉన్నాయి.