టీడీపీకి బిగ్ షాకా? : ఏపీ, తెలంగాణలో రూ.2వేల కోట్ల కుంభకోణం.. బయటపెట్టిన ఐటీ

  • Published By: veegamteam ,Published On : February 13, 2020 / 02:25 PM IST
టీడీపీకి బిగ్ షాకా? : ఏపీ, తెలంగాణలో రూ.2వేల కోట్ల కుంభకోణం.. బయటపెట్టిన ఐటీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఐటీ శాఖ భారీ కుంభకోణం బయటపెట్టింది. లెక్కలు చూపని రూ.2 వేల కోట్ల ఆదాయాన్ని గుర్తించింది. ఫిబ్రవరి 6న హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం.. కడప, ఢిల్లీ, పూణేల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. మూడు ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. 40కిపైగా ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఓ ప్రముఖ, కీలక నేత మాజీ పర్సనల్ సెక్రటరీ ఇంటిపై చేసిన దాడిలో కీలకమైన సాక్ష్యాలు, పత్రాలు లభించాయని ఐటీ శాఖ అధికారులు తెలిపారు.

బోగస్ సబ్ కాంట్రాక్టులు, ఓవర్ ఇన్వాయిసింగ్, బోగస్ బిల్లుల ద్వారా అక్రమాలకు పాల్పడట్టు అధికారులు గుర్తించారు. వాట్సప్ మేసేజ్ లు, ఈమెయిల్స్, లెక్కచూపని విదేశీ లావాదేవీలను ఐటీ అధికారులు గుర్తించారు. ఐటీ బయటపెట్టిన ఈ స్కామ్ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఇది టీడీపీకి బిగ్ షాకా అనే చర్చ జరుగుతోంది.

సీఎం జగన్ నిన్న(ఫిబ్రవరి 12,2020) ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిశారు. రాష్ట్ర ప్రాజెక్టులు, రాజకీయ అంశాలపై చర్చించారు. ఆయన ఢిల్లీ వెళ్లొచ్చిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. దీని గురించి సీఎం జగన్ ప్రధాని మోడీతో చర్చించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధానితో మాట్లాడాకే కుంభకోణం గురించి ఐటీ శాఖ బయటపెట్టినట్లు తెలుస్తోంది. టీడీపీ, చంద్రబాబుకి ఈ పరిణామం గట్టి ఎదురుదెబ్బ అనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతుంది. నెక్ట్స్ ఏం జరగనుంది అనేది హాట్ టాపిక్ గా మారింది.

* టీడీపీకి బిగ్ షాక్
* ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ కుంభకోణం.. బయటపెట్టిన ఐటీ శాఖ
* లెక్కలు చూపని రూ.2వేల కోట్లకు పైగా ఆదాయాన్ని గుర్తించిన ఐటీ
* ఫిబ్రవరి 6న హైదరాబాద్, విజయవాడ, విశాఖ, కడప, ఢిల్లీ, ఫూణెల్లో సోదాలు చేసిన ఐటీ అధికారులు

* మూడు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల కార్యాలయాల్లో సోదాలు చేసిన ఐటీ అధికారులు
* బోగస్ సబ్ కాంట్రాక్టులు, ఓవర్ ఇన్వాయిసింగ్, బోగస్ బిల్లుల ద్వారా అక్రమాలకు పాల్పడట్టు గుర్తింపు
* ఓ కీలక నేత మాజీ పర్సనల్ సెక్రటరీ నివాసంలో చేసిన సోదాల్లో కీలక పత్రాలు, సాక్ష్యాలు స్వాధీనం చేసుకున్న ఐటీ