విధుల్లోకి తీసుకుంటారా : ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ కీలక సమావేశం

సమ్మెకి ముందున్న పరిస్థితులు కల్పించి ఎలాంటి ఆంక్షలు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే బేషరతుగా సమ్మె విరమిస్తామన్న ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదనపై తెలంగాణ

  • Published By: veegamteam ,Published On : November 21, 2019 / 10:04 AM IST
విధుల్లోకి తీసుకుంటారా : ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ కీలక సమావేశం

సమ్మెకి ముందున్న పరిస్థితులు కల్పించి ఎలాంటి ఆంక్షలు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే బేషరతుగా సమ్మె విరమిస్తామన్న ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదనపై తెలంగాణ

సమ్మెకి ముందున్న పరిస్థితులు కల్పించి ఎలాంటి ఆంక్షలు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే బేషరతుగా సమ్మె విరమిస్తామన్న ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఉన్నతాధికారులతో ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ కాసేపట్లో సమావేశం కానున్నారు. కార్మికులు సమ్మె విరమిస్తే ఏం చేయాలి, కార్మికులను విధుల్లోకి తీసుకోవాల్సి వస్తే.. ఎలాంటి షరతులు విధించాలి.. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే అంశాలపై సునీల్ శర్మ చర్చించనున్నారు.

మరోవైపు సీఎం కేసీఆర్ గురువారం(నవంబర్ 21,2019) సాయంత్రం ఆర్టీసీ సమ్మెపై కీలక సమీక్ష నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి చేర్చకుంటే సమ్మె విరమిస్తామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన నేపథ్యంలో.. సీఎం సమీక్ష కీలకంగా మారింది. రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఎండీ సునీల్, అడ్వకేట్ జనరల్, ఇతర ఉన్నాతాధికారులు ఈ సమావేశానికి హాజరుకున్నారు. 

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఏయే అంశాలు ఉన్నాయి, ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది అనే వాటితో పాటు జేఏసీ ప్రతిపాదనలపై ఈ భేటీలో సీఎం కేసీఆర్ చర్చించే అవకాశం ఉందని సమాచారం. కార్మికులు విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ గతంలో రెండు సార్లు విజ్ఞప్తి చేసినా వారు చేరలేదు. ఇప్పుడు స్వతహాగా జేఏసీ ముందుకొచ్చి విధుల్లో చేరతామని చెప్పడంతో తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై పూర్తిస్థాయిలో సీఎం కేసీఆర్ సమీక్షించే అవకాశం ఉంది.

ఆర్టీసీ జేఏసీ చేసిన సమ్మె విరమణ ప్రతిపాదనతో పాటు కార్మికులను విధుల్లోకి తీసుకునే అంశంపై సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీఎం నిర్ణయం కోసం ఆర్టీసీ కార్మికులు వేచి చూస్తున్నారు.