ఇంటి దగ్గరకే 5రూపాయల భోజనం, హైదరాబాద్‌లో కొత్త పథకం

పేదోడికి ఆపన్న హస్తం. రెక్కాడితే గానీ డొక్కాడని వారికి చేయూత నివ్వడమే లక్ష్యం. అందరూ కడుపునిండా భోజనం చెయ్యాలన్నదే ఆ పథకం ఉద్దేశం. ప్రారంభించిన నాటి నుంచి

ఇంటి దగ్గరకే 5రూపాయల భోజనం, హైదరాబాద్‌లో కొత్త పథకం

Ghmc Rs 5 Meals Feeding 4 Crore People 27245

పేదోడికి ఆపన్న హస్తం. రెక్కాడితే గానీ డొక్కాడని వారికి చేయూత నివ్వడమే లక్ష్యం. అందరూ కడుపునిండా భోజనం చెయ్యాలన్నదే ఆ పథకం ఉద్దేశం. ప్రారంభించిన నాటి నుంచి

పేదల ఆకలి తీర్చేందుకు హైదరాబాద్ లో జీహెఎంసీ తీసుకొచ్చిన అన్నపూర్ణ భోజన పథకానికి (రూ.5కే భోజనం) నేటితో(మార్చి 2,2020) ఆరేళ్లు పూర్తయ్యాయి. ఈ భోజన పథకం సత్ఫలితాన్నిస్తోంది. నగరంలో రోజుకు 35 వేల మందికి పైగా ఆకలి తీరుస్తున్న ఈ పథకం.. ఆరేళ్లలో 4 కోట్ల మంది ఆకలి బాధను తీర్చింది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. ఇంటి దగ్గరకే 5రూపాయల భోజనం అందిస్తారు. ఇళ్ల నుంచి బయటికి రాలేని వృద్ధులు, వికలాంగుల కోసం అన్నపూర్ణ మొబైల్ క్యాంటీన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇంటి దగ్గరకే భోజనాన్ని పంపించి వారి ఆకలి తీర్చనుంది. సోమవారం(మార్చి 1,2020) నుంచి తొలి విడతలో 5 జోన్లలో దీనిని ప్రారంభించారు.

వృద్ధులు, వికలాంగుల కోసం ఇంటికే భోజనం:
ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఆటోల ద్వారా ఇంటికెళ్లి భోజనం అందిస్తారు. 5 ఆటోలను 5 జోన్లకు పంపుతారు. ఇప్పటికే లబ్దిదారులను గుర్తించిన అధికారులు నేరుగా వారి ఇంటికెళ్లి భోజనం ఇస్తారు. ఇందుకోసం ప్రత్యేకమైన లంచ్ బాక్సులు తయారు చేశారు. మీల్స్ బాక్స్ లో 4 డబ్బాలు ఉంటాయి. రెండు బాక్సుల్లో అన్నం, ఒక బాక్సులో కూర, మరో బాక్సులో సాంబారు ఉంటుంది. లబ్దిదారులు అన్నం తిన్నాక.. బాక్సులను తిరిగి ఆటోలో పెట్టుకుని తీసుకెళ్తారు. దీనికి భారీగానే ఖర్చు అవుతుంది. అధికారులు మాత్రం రూ.5కే భోజనం అందిస్తున్నారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

పేదోడికి ఆపన్న హస్తం. రెక్కాడితే గానీ డొక్కాడని వారికి చేయూత నివ్వడమే లక్ష్యం. అందరూ కడుపునిండా భోజనం చెయ్యాలన్నదే ఆ పథకం ఉద్దేశం. ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు  150 ప్రాంతాలకు విస్తరించింది. ప్రారంభంలో వెయ్యి మంది కడపు నింపిన ఈ పథకం… ప్రస్తుతం రోజూ 33వేల మంది ఆకలిని తీర్చుతోంది. ఆరేళ్లలో 4 కోట్ల మంది ఆకలి బాధను తీర్చిన ఆ పథకంపై టెన్‌టీవీ కథనం..

2014లో రూ.5కే భోజన పథకం ప్రారంభం:
ఒక్కపూటైనా క‌డుపునిండా అన్నం పెట్టాల‌నే ఉద్దేశంతో 5రూపాయ‌ల అన్నపూర్ణ భోజ‌న ప‌థ‌కానికి జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది. 2014లో అప్పటి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌కుమార్‌.. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ పథకానికి ప్రణాళికలు రూపొందించారు. అప్పట్లో ఉన్న బల్దియా పాలకమండలిని ఒప్పించి… మొదటి ఏడాదిలోనే ఈ పథకానికి 11 కోట్లు కేటాయించారు. అప్పటికి దేశంలో కేవలం తమిళనాడులో అమ్మ క్యాంటీన్లతో తక్కువ ధరకు ప్రజలకు ఆహారం అందిస్తున్నారు. ఆ తర్వాత జీహెచ్‌ఎంసీలో ఈ పథకాన్ని అమలు చేశారు.

ఇప్పటివరకు 4 కోట్ల మంది ఆకలి తీర్చింది:
కేవలం 5 రూపాయలకే కడుపునిండా భోజనం పెడుతుండడంతో జాతీయ స్థాయిలో ఈ పథకం విశేష ప్రాచుర్యం పొందింది. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషన్‌ హెచ్‌ఎస్‌ బ్రహ్మతోపాటు… ప్రముఖ సామాజిక వేత్త స్వామి అగ్నివేష్‌లాంటి వారు… ఐదు రూపాయల భోజనం తిని.. బల్దియా చేస్తోన్న కృషిని అభినందించారు. ఇప్పటివరకు హైదరాబాద్‌లో 4 కోట్ల మందికి ఆకలి తీర్చిందీ పథకం. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లకు హైదరాబాద్‌ ఐదు రూపాయల భోజనమే ఒక స్ఫూర్తి.

ఒక్కో భోజనానికి.. ఖర్చు రూ.24, తీసుకునేది రూ.5:
2014 మార్చి 2న నాంపల్లి సరాయి దగ్గర ఈ పథకాన్ని జీహెచ్‌ఎంసీ ప్రారంభించింది. దానిని విడతలవారీగా విస్తరిస్తూ… ప్రస్తుతం 150 ప్రాంతాల్లో 5రూపాయలకే భోజనాన్ని అందిస్తోంది. హరేకృష్ణ ఫౌండేషన్‌ సహకారంతో నిర్వహిస్తోన్న ఈ కేంద్రాల్లో 450 గ్రాముల అన్నం, 100 గ్రాముల పప్పు, సాంబారు, పచ్చడితోపాటు ఒక వాటర్‌ ప్యాకెట్‌ను అందిస్తున్నారు. ఇందుకోసం ఒక్కో భోజనానికి 24 రూపాయల 25 పైసలు ఖర్చవుతోంది. ప్రజల నుంచి 5 రూపాయలు వసూలు చేస్తోన్న  ఫౌండేషన్‌.. మిగిలిన 19 రూపాయల 25 పైసలు కార్పొరేషన్‌ నుంచి పొందుతోంది.

ఆపన్నుల ఆకలి తీరుస్తున్న పథకం:
తక్కువ ధరకే భోజనం లభిస్తుండడంతో.. పేదలు, రోజువారీ కూలీలు, ఇతరత్రా పనుల కోసం హైదరాబాద్‌కు వచ్చేవారు ఈ పథకాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. ఆస్పత్రులు, ప్రయాణ ప్రాంగణాలు ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ రద్దీ ఉంటోంది. కొన్ని చోట్ల 500 నుంచి 700 మంది వరకు ఐదు రూపాయల భోజనాన్ని చేస్తున్నారు. ఈ పథకానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండడంతో… ఈ స్కీమ్‌లోని ఇబ్బందులను అధిగమించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు రూపొందిస్తోంది. అందరూ కూర్చుని భోజనం చేసేందుకు అవసరమయ్యే చర్యలు చేపడుతోంది. (రోడ్లను కూడా వదల్లేదు, రేవంత్ రెడ్డి బ్రదర్స్ భూఅక్రమాలు)

వృద్ధులు, వికలాంగుల కోసం మొబైల్ కేంద్రాలు:
అంతేకాదు.. వృద్ధులకు, వికలాంగులకు మరింతగా చేయూతనిచ్చేందుకు మొబైల్‌ భోజన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్‌కు కొత్తగా వచ్చే వారితోపాటు.. చిరు వ్యాపారులు, ఆటో, క్యాబ్‌ డ్రైవర్లకు, నిరుద్యోగులకు ఈ పథకం ఎంతో ఉపయుక్తంగా ఉంటోంది. ఎంతో మహోన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ఐదు రూపాయల అన్నం పథకం ప్రజాదరణ పొందుతూ పేదల ఆకలి తీర్చుతోంది.

* నేటితో(మార్చి 1,2020) రూ.5 అన్నపూర్ణ భోజన పథకానికి ఆరేళ్లు
* సోమవారం నుంచి కొత్త స్కీమ్ ను ప్రారంభించిన జీహెచ్ఎంసీ
* ఇంటి దగ్గరకే 5రూపాయల భోజనం
* వృద్ధులు, వికలాంగుల కోసం కొత్తగా మొబైల్ క్యాంటీన్
* ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని వృద్ధులు, వికలాంగుల కోసం మొబైల్ క్యాంటీన్

1

* రెండు బాక్సుల్లో అన్నం, ఒక బాక్సులో కూర, ఒక బాక్సులో సాంబార్
* కొత్తగా 5 జోన్లకు 5 ఆటోలు ఏర్పాటు(సికింద్రాబాద్, ఖైరతాబాద్, ఎల్బీనగర్)
* తొలి విడతలో ప్రతి జోన్ కు ఒక మొబైల్ క్యాంటీన్ ఏర్పాటు
*  5 జోన్లలో 5 మొబైల్ క్యాంటీన్లు
* నేరుగా లబ్దిదారుల ఇంటికే సరఫరా
* నెలకు రూ.కోటి 90 లక్షలు ఖర్చు
* కొత్త స్కీమ్ ద్వారా ఒక్కో జోన్ లో 200మందికి లబ్ది

1

 

See Also | అప్లై చేసుకోండి : నేషనల్ ఇన్ఫర్మెటిక్స్ సెంటర్ లో సైంటిస్టు ఉద్యోగాలు