దేశంలోనే ఫస్ట్ : హైదరాబాద్ లో చైల్డ్‌ ఫ్రెండ్లీ కోర్టు ప్రత్యేకతలు

  • Published By: veegamteam ,Published On : March 25, 2019 / 05:33 AM IST
దేశంలోనే ఫస్ట్ : హైదరాబాద్ లో చైల్డ్‌ ఫ్రెండ్లీ కోర్టు ప్రత్యేకతలు

హైదరాబాద్ : చిన్నారులపై జరుగుతున్న హింసను అరికట్టేందుకు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలు, పోక్సో(ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్) చట్టాలను అనుసరించి..లైగింక వేధింపుల కేసుల్లో చిన్నారులకు వెంటనే  న్యాయం అందించేందుకు  దేశంలోనే మొదటిసారి చైల్డ్‌ ఫ్రెండ్లీ కోర్టును నెలకొల్పారు. లైంగిక వేధింపులు..అత్యాచారాలు వంటి హింసలకు గురవుతున్న బాలికలు వెంటనే న్యాయం చేకూర్చటమనే ఈ చైల్డ్‌ ఫ్రెండ్లీ కోర్టు ఉద్ధేశ్యం.

లైగింక వేధింపుల కేసుల్లో చిన్నారులకు వెంటనే  న్యాయం అందించేందుకు హాకాభవన్‌ (అసెంబ్లీ సమీపం)లో 2018 ఏప్రిల్ 7న చైల్డ్‌ఫ్రెండ్లీ కోర్టును ఏర్పాటుచేశారు. జిల్లా కోర్టు స్థాయిలో ఏర్పాటుచేసిన చైల్డ్‌ఫ్రెండ్లీ కోర్టును సుప్రీంకోర్టు జస్టిస్ మదన్‌బి లోకూర్ ప్రారంభించారు. ఏర్పాటు చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు 26 కేసులను విచారణ జరిపించగా అన్ని కేసుల్లోను నేరస్థులకు శిక్షను విధించింది.  మిగిలిన కేసుల్లో ఆయా నేరాల తీవ్రతను బట్టి దోషులకు 5 సంవత్సరాల నుంచి ఏడేళ్ల వరకూ శిక్ష విధించింది. 

చైల్డ్‌ఫ్రెండ్లీ కోర్టు ప్రత్యేకతలు 

  • లైంగిక వేధింపుల ఘటనల్లో గాయపడ్డ పసి మనస్సులు త్వరగా కోలుకేనేలా చేయటం..వారి భయాందళోనలను తగ్గించేలా నిపుణులతో (సైకాలజిస్ట్) కౌన్సెలింగ్ చేయటం.. చేస్తుంటారు. 
  • తమకు జరిగిన అన్యాయం గురించి కూడా చెప్పుకోలేని చిన్నారులకు మంచి వాతావరణాన్ని కల్పించి వారి బాధను చెప్పుకునే ఈ కోర్టు ఆవరణను రూపొందించారు. 
  • పూర్తిస్థాయి పోక్సో చట్టాలను అనుసరిస్తూ,  ఒక ప్లేస్కూలులో ఉన్నామన్న భావనను కలిగిస్తుంది ఈ ఛైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు. దానికి తగినట్లుగా కోర్టు పరిసరాలను తీర్చిదిద్దారు. 
  • బాధితులు, నిందితులు..ఒకే మార్గంలో రాకుండా వారు  వేర్వేరు మార్గాల ఏర్పాటు..
  • కోర్టు ట్రయల్ జరుగుతున్నంత సేపు బాధితులు, నిందితుడు ముఖాముఖి కనిపించకుండా..కోర్టు నిర్మాణం
  • బాధితులు, వారి కుటుంబ సభ్యులు వేచిచూసేందుకు ప్రత్యేకంగా ప్లే ఏరియా ఏర్పాటు
  • కోర్టు రూంలో ఉండేందుకు చిన్నారి ఇబ్బంది పడితే వీడియో లింకేజీ ద్వారా వేరే గది నుంచి మాట్లాడేలా వెసులుబాటు
  • బాధిత చిన్నారి నిందితుడిని గుర్తుపట్టి  వివరాలు చెప్పేలా వీడియో స్క్రీన్
  • న్యాయమూర్తి అడిగే ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు చిన్నారికి తన బంధువుల సహాయం తీసుకోవచ్చు. తనకు తనకు నచ్చిన విధంగా (చిన్నారికి వచ్చిన భాష) చెప్పవచ్చు
  • కోర్టు ట్రయల్ మొదలయ్యే ముందు కూడా భరోసా సెంటర్ నుంచి ఒక వ్యక్తి ముందుగా బాధిత  చిన్నారికి కొంత అవగాహన (కౌన్సెలింగ్) ఇస్తారు
  • దీన్ని వీడియో తీసి..ఎట్టి పరిస్థితుల్లోనూ బాధితురాలి వివరాలు బయటికి రాకుండా పట్టిష్టమైన జాగ్రత్తలు  తీసుకున్నారు. 
  • ఈ సందర్భంగా నగర కమిషన్ స్వాతీ లక్రా మాట్లాడుతు..చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులను సత్వరం పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా తొలిసారిగా చైల్డ్‌ఫ్రెండ్లీ కోర్టును అందుబాటులోకి తెచ్చామనీ..ఈ ప్రత్యేక చైల్డ్‌ఫ్రెండ్లీ కోర్టు ద్వారా బాధిత చిన్నారులకు  సత్వర న్యాయం లభిస్తోందని  తెలిపారు.