సమ్మర్ ప్లానింగ్: హైదరాబాద్‌లో వాటర్ ప్రాబ్లం లేకుండా చేయడమే టార్గెట్

సమ్మర్ ప్లానింగ్: హైదరాబాద్‌లో వాటర్ ప్రాబ్లం లేకుండా చేయడమే టార్గెట్

 హైదరాబాద్‌ నగరంలో ఇప్పటికే లోప్రెజర్‌తో వాటర్‌ సరఫరా అవుతున్న ప్రాంతాలను అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లోని బోర్‌వెల్స్‌ సక్రమంగా పనిచేస్తున్నాయా… వాటికి మరమ్మతులు చేయాల్సి ఉంటుందా అన్న అంశాలను స్టడీ  చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు  ఆదేశాలు జారీ అయ్యాయి. నీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూసేందుకు 10మందిని ప్రత్యేక అధికారులుగా జలమండలి నియమించింది.

ప్రతి రోజు ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించి ఎక్కడైనా నీటి సమస్య ఉంటే అక్కడ సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు. వేసవి కాలంలో నీటి సమస్యలేకుండా చేయ్యడానికి 50కోట్లతో ప్రత్యేక ప్రణాళిక రూపోందిస్తోంది. అదనపు ట్యాంకర్లు…, ఫిల్లింగ్ కేంద్రాలతోపాటు నిత్యం పర్యవేక్షించేందుకు 10మంది ప్రత్యేక అధికారులను నియమించింది. 100మందితో థర్డ్ పార్టి వ్యవస్థను కూడా సిద్దం  చేసింది జలమండలి.

వేసవికాలంలో హైదరాబాద్‌ నగరంలో ఎక్కడా నీటి సమస్య లేకుండా  చూసేందుకు ఇప్పటి నుంచి ప్రణాళికలు మొదలు పెట్టింది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని నివాస సముదాయాలకు త్రాగునీటిని అందిస్తున్న హైదరాబాద్ మెట్రో వాటర్ అండ్ సివరేజ్ సప్లై బోర్డు… ఎండాకాలంలో త్రాగునీటి ఎద్దడి లేకుండా ప్రణాళికలు రూపోందిస్తుంది.

GHMCతోపాటు.. శివారు ప్రాంతంలోని మున్సిపాలిటిలు…, కార్పొరేషన్లు…, గ్రామాలకు త్రాగునీటిని సరఫరా చేస్తుంది. నగరానికి వస్తున్న నీటి లభ్యతలో పెద్దగా మార్పు లేనప్పటికి నీటి సరఫరా  పరిధి మాత్రం పెరిగింది. దీంతో నగరంలో ఎండా కాలం నీటి ఇబ్బందులు లేకుండా చేయ్యడానికి సమ్మర్ యాక్షన్ ప్లాన్‌ను అధికారులు సిద్ధం చేశారు. 

వీటి కోసం 50కోట్లు ఖర్చు చెయ్యాలని డిసైడ్ చేశారు. ఇప్పటికే ఉన్న ట్యాంకర్లకు తోడు  మరో 230 ట్యాంకర్లను సిద్దం చెయ్యాలని  నిర్ణయించారు. కొత్తగా 23 ఫిల్లింగ్ స్టేషన్లు, 110పిల్లింగ్ పాయింట్లను కూడా సిద్దంచేస్తున్నారు. నగరంలో ట్యాంకర్ బుక్ చేసిన 48గంటల్లో నీటిని వినియోగదారులకు అందించాలని నిర్ణయించారు.

ఒకవేళ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే ఇబ్బందులు తలెత్తకుండా ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద మినీ జనరేటర్లను కూడా అందుబాటులో ఉంచాలని ప్లాన్ చేశారు అధికారులు. 

See Also | కోళ్ల నుంచి గబ్బిలాలకు సోకిన కొత్త వైరస్