తెలంగాణ నుంచి వెళ్లిపోతా, ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీలో సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం)వ్యతిరేక తీర్మానంపై జరిగిన చర్చలో బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏ విషయంలో కేసీఆర్

  • Published By: veegamteam ,Published On : March 17, 2020 / 06:58 AM IST
తెలంగాణ నుంచి వెళ్లిపోతా, ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీలో సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం)వ్యతిరేక తీర్మానంపై జరిగిన చర్చలో బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏ విషయంలో కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీలో సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం)వ్యతిరేక తీర్మానంపై జరిగిన చర్చలో బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను తప్పు దారి పట్టిస్తోందని రాజాసింగ్ ఆరోపించారు. ప్రభుత్వం చెబుతున్నట్టు భారతీయులెవరికి అన్యాయం జరగదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చెబుతున్నట్టు సీఏఏ వల్ల ఎవరికైనా అన్యాయం జరుగుతుందని నిరూపిస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని రాజాసింగ్ చెప్పారు. అంతేకాదు తెలంగాణ విడిచి వెళ్లిపోతానని సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. సీఏఏపై తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం సరైనది కాదని.. ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని విమర్శలు చేశారు. NPR, NRC, CAA వల్ల దేశంలోని ఏ పౌరుడికీ నష్టం జరగదని చెప్పినా.. అనవసర రాద్ధాంతం చేస్తున్నారని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజాసింగ్ మాట్లాడుతున్న సమయంలో స్పీకర్ మైక్ కట్ చేశారు. ఆగ్రహించిన రాజాసింగ్ వెల్ లోకి వెళ్లి సీఏఏ వ్యతిరేక తీర్మాన ప్రతులను చింపి తన నిరసన తెలిపారు. ఆ తర్వాత సభ నుంచి వెళ్లిపోయారు. 

సీఏఏ వల్ల భారతీయ ముస్లింలకు ఎలాంటి అన్యాయం జరగదని ప్రధాని మోడీ చెప్పిన విషయాన్ని రాజాసింగ్ గుర్తు చేశారు. అయినా దుష్ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఎంఐఎంను సంతోష పెట్టేందుకే కేసీఆర్ ప్రభుత్వ సీఏఏ వ్యతిరేక తీర్మానం చేసిందని రాజాసింగ్ ఆరోపించారు. సీఏఏ బిల్లు చూసి కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. 

సభలో ఓటింగ్ నిర్వహించి సీఏఏ వ్యతిరేక తీర్మానాన్ని ఆమోదించారు. ఈ తీర్మానానికి టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం సభ్యులు మద్దతు తెలిపారు. పౌరసత్వ చట్టానికి (CAA) వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన 8వ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఫిబ్రవరి 16న తెలంగాణ మంత్రి వర్గం ఈ తీర్మానాన్ని ఆమోదించగా.. సోమవారం(మార్చి 16,2020) అసెంబ్లీ ఆమోదించింది. సీఏఏకు వ్యతిరేకంగా కేరళ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, బీహార్ రాష్ట్రాలు తమ అసెంబ్లీల్లో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.

Also Read | ప్రముఖ నటుడు, దర్శకుడు ఇమ్తియాజ్ ఖాన్ కన్నుమూత..