రూ.2.50 లక్షలు : కులాంతర వివాహాలకు ఆర్థికసాయం పెంపు

కులాంతర వివాహాలకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని తెలంగాణ ప్రభుత్వం పెంచింది. ఆ మొత్తాన్ని రూ.50వేల నుంచి 2.5లక్షలకు పెంచినట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. ఈ మేరకు

  • Published By: veegamteam ,Published On : November 1, 2019 / 04:24 AM IST
రూ.2.50 లక్షలు : కులాంతర వివాహాలకు ఆర్థికసాయం పెంపు

కులాంతర వివాహాలకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని తెలంగాణ ప్రభుత్వం పెంచింది. ఆ మొత్తాన్ని రూ.50వేల నుంచి 2.5లక్షలకు పెంచినట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. ఈ మేరకు

కులాంతర వివాహాలకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని తెలంగాణ ప్రభుత్వం పెంచింది. ఆ మొత్తాన్ని రూ.50వేల నుంచి 2.5లక్షలకు పెంచినట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. ఈ మేరకు ఎస్సీ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన  కార్యదర్శి అజయ్ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. కులవ్యవస్థ మహమ్మారిని రూపుమాపడంతో పాటు ఎస్సీలను జనజీవనంలోకి తీసుకువచ్చేందుకు ప్రోత్సాహకం పెంచినట్లు తెలిపారు.

కులాంతర వివాహం చేసుకున్న నవ దంపతులకు ఆర్థిక సహాయం అందించేందుకు పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అంబేద్కర్ ఫౌండేషన్ ద్వారా కేంద్ర సామాజిక, న్యాయ, సాధికార శాఖ ఏటా 500 జంటలు  (తెలంగాణ, ఏపీల్లో 34 )లకు 2.5 లక్షలు అందజేస్తుంది. ఇందులో 50 శాతం ఐదేళ్ల కాలానికి ఎఫ్‌డీ చేస్తారు. నవ దంపతుల్లో ఒకరు ఎస్సీ, ఎస్టీ అయి ఉండి ఇరువురి వార్షిక ఆదాయం రూ.5 లక్షలు దాటనివారు ఈ  పథకానికి అర్హులు. సమాజంలో సామాజిక దురాచారాలను రూపుమాపేందుకు కులాంతర విహహా పథకం తీసుకొచ్చారు.

పలు అంశాలపై గురువారం(అక్టోబర్ 31,2019) మంత్రి కొప్పుల సమీక్ష నిర్వహించారు. దళితులకు భూ పంపిణీ కోసం అవసరమైన భూమిని సేకరించాలని అధికారులను ఆదేశించారు. పట్టణ పరిధి ఎక్కువగా ఉండే 10  జిల్లాల్లో ప్రతి జిల్లాకు కనీసం 100 ఎకరాల భూమిని గుర్తించి 3 ఎకరాల చొప్పున లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయాలని ఆదేశించారు. పట్టణ పరిధి తక్కువగా ఉన్న 20 జిల్లాల్లో ప్రతి జిల్లాకు కనీసంగా 500  ఎకరాలు గుర్తించి ఇందులో 250 ఎకరాలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే పంపిణీ చేసిన భూముల్లో వ్యవసాయం చేసేందుకు విద్యుత్తు కనెక్షన్లు, నీటి సౌకర్యం అందించాలన్నారు.