పెన్షనర్లకు శుభవార్త : టీ ఫోలియో‌లో లైఫ్ సర్టిఫికేట్

  • Published By: madhu ,Published On : November 6, 2019 / 02:04 AM IST
పెన్షనర్లకు శుభవార్త : టీ ఫోలియో‌లో లైఫ్ సర్టిఫికేట్

నవంబర్ నెల వచ్చేసరికి..పెన్షనర్లు వివిధ కార్యాలయాలకు..పరుగెడుతుంటారు. తాము బతికే ఉన్నామని..పెన్షన్ అందచేయాలని..లైఫ్ సర్టిఫికేట్ అందచేస్తుంటారు. ఎన్నో ఇబ్బందులు పడుతూ ఆఫీసులకు వెళ్లి దరఖాస్తుపత్రాలను సమర్పిస్తుంటారు. ప్రతి సంవత్సరం పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ అందచేయాలనే నిబంధన ఉంది. కానీ మీరు కార్యాలయాలకు వెళ్లాల్సినవసరం లేదని..ఒక్క క్లిక్‌తో పత్రాలను సమర్పించవచ్చని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడిస్తోంది. ఇందుకు టీ ఫోలియా యాప్‌‌ను అందుబాటులోకి తెచ్చింది.

ఈ యాప్‌‌ను స్మార్ట్ ఫోన్‌లో డౌన్ లోడ్ చేసేకొనే అవకాశం కల్పించిందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ యాప్ నవంబర్ నుంచి మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుందని, పెన్షనర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ యాప్‌లో ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సేవలున్నాయి. పెన్షనర్లు సెల్ఫీ ఫొటోతో టీ ఫోలియో యాప్ ద్వారా ఓటర్ ఐటెంటిటీ నంబర్‌తో లైఫ్ సర్టిఫికేట్ అప్ లోడ్ చేస్తే..ఏడాదంతా పెన్షన్ పొందవచ్చని తెలిపారు. 

ప్రభుత్వం అందించే రకరకాల సేవలను పొందాలంటే..మీ సేవా కేంద్రాలకు..సంబంధిత శాఖలకు వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని టీ యాప్ ఫోలియోను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో 50 వరకు సేవలు లభిస్తున్నాయి. గూగుల్ ప్లే స్టోర్‌లో యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్ 4.0 ఆపైన వెర్షన్ కలిగిన ఓఎస్ ఉన్న డివైస్‌లలో ఈ యాప్ ఇన్ స్టాల్ అవుతుంది. యాప్‌‌ను ఇన్ స్టాల్ చేసుకున్న అనంతరం ఓపెన్ చేసి రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ లేదా ఫేస్ బుక్, జీ మెయిల్‌తో కూడా ఈ యాప్‌లో రిజిష్టర్ చేసుకోవచ్చు. యూజర్ ఫోన్‌కు ఓటీపీ రూపంలో ఓ నెంబర్ వస్తుంది. దీనిని యాప్‌లో ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్స ఉంటుంది. అనంతరం యాప్‌లో లభించే సేవలను పొందవచ్చు. 
Read More : ఉక్కపోస్తోంది : చలికాలంలో అధిక ఉష్ణోగ్రతలు