Telangana Assembly: నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. నేడు కేంద్రానికి సంబంధించిన 2 కీలక అంశాలపై చర్చ

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల విరామం తర్వాత తిరిగి నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. నిన్న శాసనసభ, శాసన మండలిలో ఇవాళ ప్రశ్నోత్తరాలు రద్దు చేసి నేరుగా స్వల్పకాలిక చర్చ జరిపారు. కేంద్ర సర్కారు విద్యుత్ బిల్లుపై సీఎం కేసీఆర్ కూడా మాట్లాడారు. శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. నేడు కూడా ప్రశ్నోత్తరాలు రద్దయ్యాయి. ఇవాళ అసెంబ్లీలో పలు బిల్లులపై చర్చలు జరుగుతాయి.

Telangana Assembly: నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. నేడు కేంద్రానికి సంబంధించిన 2 కీలక అంశాలపై చర్చ

Telangana Assembly

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల విరామం తర్వాత తిరిగి నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. నిన్న శాసనసభ, శాసన మండలిలో ఇవాళ ప్రశ్నోత్తరాలు రద్దు చేసి నేరుగా స్వల్పకాలిక చర్చ జరిపారు. కేంద్ర సర్కారు విద్యుత్ బిల్లుపై సీఎం కేసీఆర్ కూడా మాట్లాడారు. శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. నేడు కూడా ప్రశ్నోత్తరాలు రద్దయ్యాయి. ఇవాళ అసెంబ్లీలో పలు బిల్లులపై చర్చలు జరుగుతాయి.

అలాగే, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రెండు అంశాలపై చర్చలు జరగనున్నాయి. కేంద్ర విద్యుత్‌ బిల్లును వ్యతిరేకిస్తున్న బిల్లుతో పాటు కొత్త పార్లమెంటు భవనానికి అంబేడ్కర్‌ పేరు పెట్టాలని కోరుతూ ప్రభుత్వం తీర్మానాలను ప్రవేశట్టనుంది. ఆ తర్వాత వీటిపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

అనంతరం ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం అమలులో కేంద్రం ద్వంద్వ విధానం, దాని వల్ల తెలంగాణపై పడుతున్న ప్రభావంతో పాటు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలులో వైఫల్యంపై అసెంబ్లీ స్వల్పకాలిక చర్చ జరగనుంది. ములుగు వద్ద ఉన్న అటవీ కళాశాలను వర్సిటీగా మార్చేందుకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై చర్చించే అవకాశం ఉంది. అలాగే, పలు బిల్లులపై నేడు చర్చిస్తారు.

Jio satellite communication: ఎలాన్‌ మస్క్‌తో ముకేశ్ అంబానీ పోటీ.. ‘జియో’కు శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీసుల కోసం ఎల్వోఐ