రిపబ్లిక్ డే : పరేడ్ కు వెళ్లే వాళ్లు తెలుసుకోవాల్సిన విషయాలు

వీఐపీ పార్కింగ్ కోసం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారికి కేటాయించిన పాస్ల ఆధారంగా పార్కింగ్ ఉంటుంది. అలాగే  సాధారణ ప్రజల వాహనాలను పార్కింగ్ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. 

  • Published By: veegamteam ,Published On : January 25, 2019 / 05:08 AM IST
రిపబ్లిక్ డే : పరేడ్ కు వెళ్లే వాళ్లు తెలుసుకోవాల్సిన విషయాలు

వీఐపీ పార్కింగ్ కోసం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారికి కేటాయించిన పాస్ల ఆధారంగా పార్కింగ్ ఉంటుంది. అలాగే  సాధారణ ప్రజల వాహనాలను పార్కింగ్ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. 

పార్కింగ్ ఏర్పాట్లు: వీఐపీ పార్కింగ్ కోసం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారికి కేటాయించిన పాస్ల ఆధారంగా పార్కింగ్ ఉంటుంది. అలాగే  సాధారణ ప్రజల వాహనాలను పార్కింగ్ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. 
ఏఏ, ఏ1, బి1 కారు పాసులన్న వారు బేగం పేట్ వైపు నుంచి రసూల్ పూరా జంక్షన్, సీటీఓ ఫ్లైఓవర్ వైపు వెళ్లాలి. అవే పాస్లతో అప్పర్ ట్యాంక్ బండ్, రాణిగంజ్ నుంచి వచ్చేవారు ఎంజీరోడ్ లేదా పార్క్ లేన్ వైపు వెళ్లాలి. అక్కడి నుంచి సెంట్రల్ టెలిగ్రాఫ్ ఐలండ్, ప్లాజా జంక్షన్ల మీదగా సర్దార్ పటేల్ రోడ్ నుంచి పరేడ్ గ్రౌండ్ చేరుకోవాలి. కంటోన్మెంట్ నుంచి వచ్చే వారు టివోలి, ప్లాజాల నుంచి ఎడమవైపు తిరిగి వాహనాలను పార్కింగ్ స్ధలాల్లో వాహనాలను పార్క్ చేయాలి.  
ఏఏ కారు పాసులున్న వారు అతిథులను మెయిన్ గేట్ వద్ద దింపి ఎస్పీరోడ్డులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వీఐపీ పార్కింగ్ ఏరియాలో వాహనాలను నిలపాలి.
ఏ1 కారు పాసులున్న వారు అతిథులను ఏ1 గేటు వద్ద దింపిన తర్వాత జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్‌ కింద పార్క్‌ చేయాలి.
బి1 కారు పాసులున్న వారు బి1 గేటు వద్ద అతిథులు దిగిన తర్వాత చీఫ్‌ ఇంజనీర్‌ కార్యాలయం, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ వద్ద పార్క్‌ చేయాలి.
ఏ2 కారు పాసులున్న వారు ఎంజీరోడ్‌, బేగంపేట్‌, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ వైపు నుంచి వచ్చేవారు జింఖానా గ్రౌండ్‌లో అతిథులను దింపి అక్కడే వాహనాలను పార్క్‌ చేయాలి.
బి2 పాసులున్న వారు ఆర్‌పీ రోడ్‌, ఎస్‌బీహెచ్‌ క్రాస్‌ రోడ్స్‌ నుంచి పరేడ్‌గ్రౌండ్‌ తూర్పు గేటు వరకు వచ్చి అక్కడి నుంచి కుడివైపు తిరిగి చీఫ్‌ ఇంజనీరింగ్‌ కార్యాలయం వద్ద అతిథులను దింపి వాహనాలను పార్క్‌ చేయాలి.
పాస్‌లు లేకుండా వచ్చే కార్లతోపాటు బైక్‌లు, ఇతర వాహనాలు లాంబా థియేటర్‌ వద్ద సిద్ధాంతి కాలేజ్‌ లేన్‌లో పార్క్‌ చేయాలి.
కార్యక్రమం పూర్తయిన తర్వాత ఏఏ, ఏ1, బీ1 కారు పాసులున్న వారు ఎస్‌పిరోడ్‌ ద్వారా, ఏ2 కారు పాసులున్న వారు టివోలి క్రాస్‌ రోడ్స్‌ వైపు, బి2 కారు పాసులున్న వారు ఎస్‌బీహెచ్‌ జంక్షన్‌ వైపు నుంచి బయటకు వెళ్లాలి.
ఉదయం 7 నుంచి ఉదయం 10.30 గంటల వరకు ఎస్‌పీ రోడ్‌ (సిటీఓ- వైఎంసీఏ మధ్య) వన్‌వేగా పరిగణిస్తారు. వాహనాలకు సీటీఓ జంక్షన్‌ నుంచి వైఎంసీఏ వైపు మాత్రమే అనుమతి ఉంటుంది.
సాధారణ ప్రజల వాహనాలను లాంబా థియేటర్‌ వీధిలో పార్క్‌ చేయాలి.
పాసులున్న వారు తమ వాహనాలపై అద్దం ఎడమ వైపు కనిపించే విధంగా వాటిని అతికించాలి.
10 నిమిషాల ముందే చేరుకోవాలి:
వేడుకల విజయవంతానికి ప్రజలు సహకరిస్తూ, 10 నిమిషాల ముందే మైదానానికి చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ పతకం ఆవిష్కరణ, జాతీయ గీతాలాపన సమయంలో నిలబడి సెల్యూట్ చేయాలని విద్యార్ధినీ విద్యార్ధులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
వీటిని అనుమతించరు:
వేడుకలకు వచ్చేవారు హ్యాండ్‌ బ్యాగ్‌లు, బ్రీఫ్‌కేసులు, కెమెరాలు, టిఫిన్‌ బాక్స్‌లు వంటి వస్తువులను తీసుకొస్తే అనుమతించరు.