ఓటు, పోలింగ్ బూత్ క్షణాల్లో తెలుసుకోవచ్చు : కొత్త ఆప్షన్స్‌తో ”నా ఓటు యాప్”

హైదరాబాద్ : నా ఓటు App.. ఓటర్ల సౌలభ్యం కోసం ఈసీ తీసుకొచ్చిన యాప్ ఇది. 2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో దీన్ని రిలీజ్ చేశారు. ఓటర్లు

  • Published By: veegamteam ,Published On : March 31, 2019 / 03:34 AM IST
ఓటు, పోలింగ్ బూత్ క్షణాల్లో తెలుసుకోవచ్చు : కొత్త ఆప్షన్స్‌తో ”నా ఓటు యాప్”

హైదరాబాద్ : నా ఓటు App.. ఓటర్ల సౌలభ్యం కోసం ఈసీ తీసుకొచ్చిన యాప్ ఇది. 2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో దీన్ని రిలీజ్ చేశారు. ఓటర్లు

హైదరాబాద్ : నా ఓటు App.. ఓటర్ల సౌలభ్యం కోసం ఈసీ తీసుకొచ్చిన యాప్ ఇది. 2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో దీన్ని రిలీజ్ చేశారు. ఓటర్లు సులభంగా ఓటు వేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్న ఈసీ.. ఓటర్లు సులభంగా ఓటు వేసేందుకు ‘నా ఓటు’ పేరుతో ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌లో 8 రకాల వివరాలను నిక్షిప్తం చేశారు. ఓటర్ పేరు లేదా ఎపిక్‌ కార్డు నెంబర్ ను యాప్‌లో ఎంటర్‌ చేస్తే, ఏ పోలింగ్‌ బూత్‌లో ఓటరు ఓటు ఉందో చూపిస్తుంది.
Read Also : రాహుల్ పీఎం కాగానే భార్యకు భరణం ఇస్తా : కోర్టులో భర్త వాదన

లోక్‌సభ ఎన్నికల వేళ ఈ యాప్ ను అప్‌డేట్ చేశారు. మరిన్ని ఆప్షన్స్ తో తీసుకొచ్చారు. ఓటర్లకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ యాప్ ను ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంచామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాయలం తెలిపింది. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో పని చేస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద పని చేసే ఈ యాప్ ద్వారా ఓటర్ కు అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఈసీ తెలిపింది.

నా ఓటు యాప్ ప్రయోజనాలు:
* ఓటర్ తన ఎపిక్ నెంబర్, పేరు, నియోజకవర్గాన్ని క్షణాల్లో కనుకోవచ్చు
* నియోజకవర్గం, జిల్లాలు, పోలింగ్ స్టేషన్, బూత్ ల వారిగా అధికారుల వివరాలు తెలుసుకోవచ్చు
* పోలింగ్ బూత్ కి సులువుగా వెళ్లేందుకు గూగుల్‌ నేవిగేషన్‌
* నియోజకవర్గాల వారిగా పోటీలో ఉన్న అభ్యర్థులు వివరాలు తెలుసుకోవచ్చు
* ఎపిక్ నెంబర్ లేదా ఓటర్ పేరు సాయంతో పోలింగ్ స్టేషన్, పోలీస్ స్టేషన్లు తెలుసుకోవడం, అక్కడికి వెళ్లడానికి దగ్గర మార్గం, అందుబాటులో ఉన్న బస్టాప్, రైల్వే స్టేషన్ ఎక్కడున్నాయి తెలుసుకోవచ్చు. అలాగే ట్యాక్సీ, మెట్రో సమాచారం తెలుసుకోగలరు.
* దివ్యాంగ ఓటర్లకు పోలింగ్ బూత్ కు వెళ్లి రావడానికి రవాణ సౌకర్యం కల్పించమని రిక్వెస్ట్ చేసుకునే సౌలభ్యం
* ఆన్ లైన్ ద్వారా ఓటర్ పేరు నమోదు వివరాలు తెలుసుకోవచ్చు
Read Also : కాంగ్రెస్‌కి బిగ్ షాక్ : పొంగులేటి సుధాకర్ రెడ్డి రాజీనామా