ఆన్ లైన్ లో ఓటుకి సన్నాహాలు : ఏపీ, తెలంగాణలో ఒకేసారి ఎలక్షన్స్

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో అంటే ఏపీ, తెలంగాణలో ఒకే రోజు సాధారణ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని తెలంగాణ

  • Published By: veegamteam ,Published On : September 4, 2019 / 04:26 AM IST
ఆన్ లైన్ లో ఓటుకి సన్నాహాలు : ఏపీ, తెలంగాణలో ఒకేసారి ఎలక్షన్స్

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో అంటే ఏపీ, తెలంగాణలో ఒకే రోజు సాధారణ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని తెలంగాణ

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో అంటే ఏపీ, తెలంగాణలో ఒకే రోజు సాధారణ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. బోగస్ ఓట్లను అరికట్టేందుకు తెలుగు రాష్ట్రాల్లో ఒకేరోజు ఎన్నికలు జరిపేందుకు నిర్ణయించామన్నారు. కొందరు తెలంగాణలో ఓటు వేసి మళ్లీ ఆంధ్రాలోనూ వేసేందుకు వెళ్తున్న కారణంగా ఈ ప్రతిపాదన తీసుకొచ్చామన్నారు. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం అంగీకరించిందని రజత్ కుమార్ తెలిపారు. అంతేకాదు ఇంటి నుంచే ఆన్ లైన్ లో ఓటువేసే అంశాన్ని ఈసీ పరిశీలన చేస్తోందన్నారు.

ప్రస్తుతం ప్రతి 1400 ఓట్లకు ఒక పోలింగ్ కేంద్రం ఉండగా దీన్ని 1500కు పెంచే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. ఒకే కుటుంబానికి చెందినవారి ఓట్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఉంటే వాటిని సవరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితా పరిశీలన చేస్తారని, వందశాతం ఓటరు నమోదు చేసిన వారికి ఉత్తమ బీఎల్ఓ అవార్డులను అందించనున్నట్లు తెలిపారు. ఓటరు జాబితా పరిశీలనలో కాలనీ సంక్షేమ సంఘాలు కీలక పాత్ర పోషించాలన్నారు. విజయవంతంగా పూర్తి చేసిన ఉత్తమ కాలనీ సంక్షేమ సంఘాలను ఎంపిక చేసి నగదు పారితోషికం ఇచ్చి సన్మానిస్తామని రజత్ కుమార్ తెలిపారు. మంగళవారం(సెప్టెంబర్ 3,2019) మాదాపూర్ లో ఓటరు జాబితా పరిశీలనపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రజత్ కుమార్ మాట్లాడారు.