పంచుడు షురూ :  ఓటుకు రూ.2వేలు

ఎన్నికల ప్రచారానికి ఏప్రిల్ 9 సాయంత్రం నుంచి తెరపడనుంది. దీంతో డబ్బులు పంచేందుకు నేతలు తెరలేపారు.

  • Published By: veegamteam ,Published On : April 9, 2019 / 04:10 AM IST
పంచుడు షురూ :  ఓటుకు రూ.2వేలు

ఎన్నికల ప్రచారానికి ఏప్రిల్ 9 సాయంత్రం నుంచి తెరపడనుంది. దీంతో డబ్బులు పంచేందుకు నేతలు తెరలేపారు.

ఎన్నికల ప్రచారానికి ఏప్రిల్ 9 సాయంత్రం నుంచి తెరపడనుంది. దీంతో డబ్బులు పంచేందుకు నేతలు తెరలేపారు. ఎన్నికల తేదీకి  రెండు రోజులే మాత్రమే ఉండటంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతల తాయిలాలాలకు తెరదీశారు. ఈ క్రమంలో తెలంగాణలో సోమవారం (ఏప్పిల్ 8) నుంచే నగదు,వస్తువుల పంపిణీ షురూ చేసేశారు.

ఈసీ ఎన్ని చర్యలు తీసుకున్నా ఇప్పటికే  కోట్లాది రూపాయలు గ్రామాలకు చేరిపోయాయి. హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లో ఓటుకు రూ.2వేల వరకూ పంచుతుండగా..జిల్లాలు..గ్రామాల్లో రూ. వెయ్యి  వరకు పంచుతున్నారు. వీటితో పాటు మద్యం పంపిణీ కూడా జోరుగానే జరుగుతోంది. 
Read Also : మద్యంపై ఆంక్షలు: 6 మించి అమ్మొద్దు..గీత దాటితే వాతే

ఖమ్మం నియోజకవర్గంలో పరిధిలో ఖమ్మం, కొత్తగూడెంలతో పాటు ఆ పరిధిలోని గ్రామాలలో ఓటుకు రూ.వెయ్యి తగుసీ రూ.700, రూ.500చొప్పున.. కరీంనగర్‌లో అభ్యర్థులు నేరుగా డబ్బులు ఇవ్వకుండా బూత్‌ల వారీగా పడిన ఓట్లను బట్టి ఇస్తున్నారు. అంతేకాదు యువతను ఆకర్షించుకునేందుకు వారికి విందుతో పాటు మందు బాటిల్స్ కూడా ఇస్తున్నట్లు సమాచారం.  

ఉమ్మడి నల్గొండలో రూ.500..గ్రామాల్లో డబ్బుతో పాటు మందు..పట్టణాల్లో నగదుతో పాటు యువతకు క్రికెట్ కిట్లు, జిమ్ పరికరాలు వంటివి పంచుతున్నారు. హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో నేతలు అపార్ట్‌మెంట్ సంక్షేమ సంఘాల నేతలను కలిసి గుంపగుత్తగా ఓట్లు కొనుగోలు చేస్తున్నారు
Read Also : సర్వేలు అనుకూలం: ఓటమి భయంతో వైసీపీ బెంబేలు