దేశంలోనే ఫస్ట్ టైమ్ : గాలి నుంచి నీరు.. లీటర్ రూ.5

ఇప్పటి వరకు వర్షపు నీరు, భూగర్భ జలాల నుంచి నీరు తీయడం మాత్రమే మనకు తెలుసు. కానీ ఆ స్టార్టప్ కంపెనీ.. ఏకంగా గాలి నుంచి నీరు తీసి అందరినీ ఆశ్చర్యపరిచింది. గాలి

  • Published By: veegamteam ,Published On : December 14, 2019 / 07:09 AM IST
దేశంలోనే ఫస్ట్ టైమ్ : గాలి నుంచి నీరు.. లీటర్ రూ.5

ఇప్పటి వరకు వర్షపు నీరు, భూగర్భ జలాల నుంచి నీరు తీయడం మాత్రమే మనకు తెలుసు. కానీ ఆ స్టార్టప్ కంపెనీ.. ఏకంగా గాలి నుంచి నీరు తీసి అందరినీ ఆశ్చర్యపరిచింది. గాలి

ఇప్పటి వరకు వర్షపు నీరు, భూగర్భ జలాల నుంచి నీరు తీయడం మాత్రమే మనకు తెలుసు. కానీ ఆ స్టార్టప్ కంపెనీ.. ఏకంగా గాలి నుంచి నీరు తీసి అందరినీ ఆశ్చర్యపరిచింది. గాలి నుంచి నీళ్లను తీసే యంత్రాన్ని తయారుచేసి దేశంలోనే మొట్టమొదటగా తెలంగాణలో అందుబాటులోకి తెచ్చింది. 

గాలి నుంచి తీసిన నీరు తాగాలనుందా? అయితే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్లాల్సిందే. మేకిన్ ఇండియా స్ఫూర్తితో మైత్రి ఆక్వాటెక్ అనే సంస్థ మేఘ్ దూత్ పేరుతో అట్మోస్పియరిక్ వాటర్ జనరేటర్ ను రూపొందించింది. పర్యావరణ పరిరక్షణ, ప్రయాణికులకు స్వచ్ఛమైన నీటిని అందించాలన్న లక్ష్యంతో భారతీయ రైల్వేలోనే తొలిసారిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దీన్ని ఏర్పాటు చేశారు. రోజుకు వెయ్యి లీటర్ల కెపాసిటీతో డెవలప్ చేసిన ఈ ‘మేఘ్ దూత్’ ను రైల్వే జీఎం గజానన్ ప్రారంభించారు.

అట్మోస్పియరిక్ వాటర్ జనరేటర్ పూర్తి అధునాతన టెక్నాలజీతో రూపొందించిన కొత్త విధానం. ఇందులో గాలి నుంచి అంచెలంచెలుగా నీటిని సేకరిస్తారు. గాలిని వడబోసే పద్ధతి ద్వారా తేమలో ఉండే కాలుష్యాలను తొలగిస్తారు. ఆ తర్వాత గాలి ఒక చల్లని గదిలోకి వెళ్లి ఐస్ గా మారుతుంది. దాన్నుంచి ఏర్పడే నీటి బిందువులు.. అక్కడ ఏర్పాటు చేసిన పాత్రలోకి చేరతాయి. ఇలా వచ్చిన నీటిని పూర్తిగా ఫిల్టర్ చేసి అల్ట్రా వయులెట్ విధానంలో పరిశుభ్రంగా మారుస్తారు. ఆ తర్వాత నీటికి కావాల్సిన ఖనిజ లవణాలు కలిపి స్వచ్ఛమైన తాగునీరును సిద్ధం చేస్తారు.