ఘర్ వాపసీ మొదలు పెట్టాం.. ఎవరు వచ్చినా చేర్చుకుంటాం: జగ్గారెడ్డి

సంభాని చంద్రశేఖర్ లాంటి వాళ్లు కూడా వెనక్కి వచ్చారు. ఎవరు వచ్చినా చేర్చుకుంటాం. మనకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్ళను కూడా చేర్చుకోవాలని హైకమాండ్ సూచించింది.

ఘర్ వాపసీ మొదలు పెట్టాం.. ఎవరు వచ్చినా చేర్చుకుంటాం: జగ్గారెడ్డి

Jagga Reddy: కాంగ్రెస్ పార్టీలో ఘర్ వాపసీ మొదలు పెట్టామని, చాలా మంది నాయకులు వెనక్కి వస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. శుక్రవారం మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంభాని చంద్రశేఖర్ లాంటి వాళ్లు కూడా వెనక్కి వచ్చారని, ఎవరు వచ్చినా చేర్చుకుంటామన్నారు. మనకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్ళను కూడా చేర్చుకోవాలని హైకమాండ్ సూచించిందని వెల్లడించారు. సంగారెడ్డిలో నాకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్ళు వచ్చి చేరతానన్నా, చేర్చుకుంటామన్నారు.

”ఏఐసీసీ నిర్ణయాల మేరకే నడుచుకుందాం. మనకు పదవులు సోనియాగాంధీ.. రాహుల్ కష్టమే. రాజీవ్ గాంధీని చంపిన వ్యక్తులను క్షమించిన గుణం సోనియాగాంధీ, రాహుల్.. ప్రియాంకది. మనం వాళ్ళ నీడలో రాజకీయంగా బతుకుతున్నాం. నా దగ్గర కూడా వ్యతిరేకంగా ఐదారుగురు పని చేశారు. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మళ్ళీ వస్తానంటే రమ్మని చెప్పినా. అమిత్ షా మైనార్టీ రిజర్వేషన్లు తీసేస్త అంటున్నారు. మైనార్టీలు జాగ్రత్తగా ఉండండి బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తోంద”ని జగ్గారెడ్డి అన్నారు.

Also Read: హరీశ్ రావు సవాల్.. అందుకే సీఎం రేవంత్ రెడ్డి రాలేదు: మంద కృష్ణమాదిగ

కాంగ్రెస్‌లో చేరిన సంగిశెట్టి జగదీష్
ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన నాయకుడు సంగిశెట్టి జగదీష్ సొంతగూటికి తిరిగొచ్చారు. ఘర్ వాపసీలో భాగంగా కాంగ్రెస్ పార్టీలోకి తిరిగొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ పార్టీని వీడారు. ఇప్పుడు మళ్లీ సొంత పార్టీలోకి తిరిగొచ్చారు.

Also Read: అందుకోసమే.. భగవంతుడు నన్ను పుట్టించాడు- కేసీఆర్ కీలక వ్యాఖ్యలు