కొడుకు కోసం వృద్ధ దంపతుల దీనస్థితి : పోలీసుల ఔదార్యం 

  • Published By: veegamteam ,Published On : March 21, 2019 / 10:29 AM IST
కొడుకు కోసం వృద్ధ దంపతుల దీనస్థితి : పోలీసుల ఔదార్యం 

కాచిగూడ  : కరడు కట్టిన ఖాకీ దుస్తుల వెనుక కష్టాన్ని చూసి చలించిపోయే మనస్సు ఉందని చాటి చెప్పారు పోలీసులు. కన్నబిడ్డ జాడ తెలియక అల్లాడిపోతున్న  ఓ వృద్ధ దంపతుల పాలిట తమ ఔదార్యాన్ని చూపించారు కాచిగూడ పోలీసులు. తెలియని ప్రాంతంలో కొడుకు కోసం వెతికి వెతికి వేసారిపోయిన వారికి కడుపు నిండా అన్నం పెట్టి ఆదుకున్నారు. 
Read Also : బోరుబావిలో చిన్నారి – రంగంలోకి సైన్యం

రాజస్థాన్‌కు చెందిన వృద్ధ దంపతులు హైదరాబాద్‌లోని ఉప్పల్ సమీపంలో ఉంటున్న తన కుమారుడ్ని చూసేందుకు నగరానికి వచ్చారు. కాచిగూడలో రైలు దిగిన తర్వాత కొడుకు ఇంటికి ఎలా వెళ్లాలో తెలియలేదు పాపం వారికి. సాయం కోసం ఎవరిని ఎలా అడగాలో కూడా తెలియని స్థితిలో దీనంగా అక్కడే కూర్చొన్నారు. వారిని గమనించిన  కాచిగూడ పోలీస్ స్టేషన్ కు చెందిన రమేష్, గౌరీ శంకర్‌ అనే  ఇద్దరు కానిస్టేబుల్స్ వారిని వివరాలడిగి తెలుసుకున్నారు. 

విషయం తెలుసుకుని వారి కష్టాన్ని చూసి చలించిపోయిన కానిస్టేబుల్స్ వెంటనే భోజనం అందించారు. కొడుకు వివరాలు తెలుసుకొని ఆటోలో దంపతుల్ని ఉప్పల్ పంపించారు. కొడుకు జాడ తెలియక కష్టంలో ఉన్న ఆ తల్లిదండ్రులకు అండగా నిలిచి.. సాయం చేసిన కానిస్టేబుళ్లను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. 

Read Also : న్యూజిలాండ్ లో తుపాకుల అమ్మకాలపై నిషేధం