సమ్మెపై స్పందన : ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొస్తాం – ఎర్రబెల్లి

  • Published By: madhu ,Published On : October 13, 2019 / 05:06 AM IST
సమ్మెపై స్పందన : ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొస్తాం – ఎర్రబెల్లి

తెలంగాణ ఆర్టీసీని లాభల బాటల్లోకి తెస్తామని..ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఏనాడు చెప్పలేదన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కార్మికులు చేపడుతున్న సమ్మె వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. ఆర్టీసీకి 3 వేల కోట్లకు పైగా తమ ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. కార్మికులకు ఇబ్బంది పెట్టే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదన్నారు. ఆర్టీసీ కార్మికులను యూనియన్లు వాడుకుంటున్నాయని, ప్రతిపక్షాల వలలో యూనియన్లు పడ్డాయని విమర్శించారు.

ప్రైవేటుకరణ చేస్తారని కాంగ్రెస్ నేతలు రెచ్చగొడుతున్నారని, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పార్టీలు ఆర్టీసీని బలోపేతం ఎందుకు చేయలేదని, చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, మరి ఆర్టీసీని విలీనం చేశారా అని ప్రశ్నించారు. సంస్థను కాపాడేందుకు సీఎం కేసీఆర్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కార్మికులు 25 శాతం ఫిట్ మెంట్ అడిగితే..కార్మికుల సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్ 44 శాతం ఇచ్చారన్నారు. 45 వేల కోట్ల రూపాయలు మిషన్ భగీరథకు వెచ్చిస్తే..కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. పండుగ సీజన్‌లో సమ్మె చేయడం మంచిది కాదని చెప్పాలి కానీ..ఇలా చేయడం కరెక్టు కాదన్నారు. ఎవరూ ఎంతమంది అడ్డుకున్నా..అభివృద్ధిలో రాష్ట్రం దూసుకపోతుందని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. 

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఇప్పటివరకు సైలెంట్‌గా ఉన్న గులాబీ దళం ఇప్పుడు సై అంటోంది. ఆర్టీసీ జేఏసీకి, విపక్షాలకు గులాబీ పార్టీ నేతలు సవాళ్లు విసురుతున్నారు. ఆర్టీసీ కార్మికులు మానవతా దృక్పథంతో వ్యవహరించలేదని.. కీలక సమయంలో సమ్మెకు దిగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 2018 ఎన్నికల మేనిఫెస్టోలో తాము ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇవ్వలేదని ఎదురుదాడి మొదలు పెట్టారు మంత్రులు.
Read More : TSRTC సమ్మెపై సెటైర్లు : దమ్ముంటే అక్కడ విలీనం చేయండి – తలసాని