ఈ క్వాలిటీస్ ఉన్నవారికే తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ పదవి

  • Published By: veegamteam ,Published On : March 24, 2020 / 10:13 AM IST
ఈ క్వాలిటీస్ ఉన్నవారికే తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ పదవి

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి మార్పు ఖాయమైపోయిందా? త్వరలోనే కొత్త పీసీసీ చీఫ్ గాంధీభవన్‌లో అడుగు పెట్టబోతున్నారా? ఆశావహుల్లో ఎవరి స్టామినా ఏంటో తెలుసుకొనే పనిలో పార్టీ ఢిల్లీ పెద్దలు ఉన్నారా? హైకమాండ్‌ అన్వేషణలో పార్టీని నడిపించే ఘటికుడు ఎవరో తేలిపోయిందా? 

ఆశావహుల్లో సమర్థులైన నాయకుల గురించి హైకమాండ్‌ ఆరా:
కష్టాల్లో ఉన్న కాంగ్రెస్‌ను కాపాడే నాయకుడి కోసం వెతుకులాట మొదలైంది. ఇప్పటివరకు నాయకత్వం వహించిన కెప్టెన్ కంటే మంచి లీడర్స్ ఉన్నారా? టీపీసీసీ పదవి ఆశిస్తున్న తెలంగాణ నాయకుల్లో సమర్థులు ఎవరనే వివరాలపై కాంగ్రెస్ హైకమాండ్ అన్వేషణ మొదలు పెట్టిందట. దీనికోసం తమ దగ్గరకు వస్తున్న రాష్ట్ర నాయకుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నాలు చేస్తోంది. వారి వారి మనసులో మాటతో పాటు.. క్షేత్రస్ధాయి నుంచి వస్తున్న వివిధ వాదానలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం.

రాష్ట్రం నుంచి హస్తిన వెళ్లిన ఆశావహులు:
మరోపక్క, ఇటీవల కాలంలో కాంగ్రెస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడి నియమాకం కోసం ప్రక్రియ మొదలు పెట్టారు. తెలంగాణ రాష్ట్రం నుంచి యూత్ కాంగ్రెస్ పదవి ఆశిస్తున్న అభ్యర్ధులు అంతా హస్తిన వెళ్లారు. పార్టీ యూత్ వింగ్ కో-ఆర్డినేటర్స్, ఇంచార్జ్ శ్రీనివాసన్ సమక్షంలో ఆశావహులు తమ బయోడేటాను సమర్పించుకున్నారు. దాదాపు 20 మంది యూత్ కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు వారు. ఈ సందర్భంగా 
వారు తమ తమ స్ధానాల కోసం చర్చించే సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ పరిణామాలు, ఇటీవల ముఖ్య నేతల మధ్య నెలకొన్న కోల్డ్ వార్‌ పైనా ఆరా తీసినట్లు చెబుతున్నారు. టీపీసీసీ చీఫ్‌గా శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డిలలో ఎవరైతే బాగుంటుంది? ఇప్పుడున్న చీఫ్‌తో వస్తున్న ఇబ్బందులు ఏంటనే కోణంలో ఆరా తీశారని నేతలు అంటున్నారు.

బలాలు, బలహీనతలు, కలుపుకొని పోయే తత్వంపై వాకబు:
రాష్ట్ర కాంగ్రెస్ నుంచి వివిధ పనుల మీద హస్తిన వస్తున్న వారినీ హైకమాండ్‌ వదల్లేదట. రాష్ట్రంలో పార్టీని బాగు చేసేందుకు సత్తా ఉన్న నాయకులు.. వారిలో ఉన్న క్వాలీటిస్, వారి బలహీనతలు.. వారిjr కలుపుకొనిపోయే తత్వం ఎంతవరకు ఉంది? అంటూ వాకబు చేశారట. ఈ చర్యలతో ఇక త్వరలో తెలంగాణకు కొత్త సారథి ఖాయమని స్పష్టమైంది. అయితే మధ్యప్రదేశ్ సంక్షోభం తర్వాత రాష్ట్రంలోని సీనియర్స్ అందరినీ ఒక్కసారి ఢిల్లీకి పిలిపించి చర్చించే చాన్స్ ఉందని అంటున్నారు గాంధీభవన్ పెద్దలు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చక్కదిద్ది… క్యాడర్‌లో జోష్ నింపి, ఎస్ మేమున్నామని ధైర్యం ఇచ్చే నాయకుడు ఎవరని అధిష్టానం భావిస్తుందో తెలియక ఆశావహులు కాస్తా ఆందోళనలో ఉన్నారట. అసలు అధిష్టానం ఎవరికి పీఠం అప్పగిస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Also Read | స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారా? సక్సెస్ అవుతారా?